ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Death certificate: ఆనంద్ మహీంద్ర ట్వీట్.. పడిపడి నవ్వుకుంటున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-07-27T21:30:43+05:30

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) అటు వ్యాపారంలోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటారు. తన ఆలోచనలతో వ్యాపారాల్లో లాభాలను పొందే ఆయన.. Social Media పోస్టుల ద్వారా ప్రజలకు దగ్గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) అటు వ్యాపారంలోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటారు. తన ఆలోచనలతో వ్యాపారాల్లో లాభాలను పొందే ఆయన.. Social Media పోస్టుల ద్వారా ప్రజలకు దగ్గరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. నెటిజన్లు అంతగా నవ్వుకోవడానికి ఆయన చేసిన ట్వీట్‌లో ఏంముంది అనేగా మీ సందేహం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 


ఇండియాలో ఎవరైనా ఓ వ్యక్తి చనిపోతే.. అతడికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌(Death certificate)‌ కోసం కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటారు. ఒక్క ఇండియాలోనే కాదు సాధారణంగా ఇటువంటి విధానమే అన్ని దేశాల్లోనూ ఉంటుంది. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న మెక్‌లెన్ బర్గ్ కౌంటీ(Mecklenburg County) ప్రజలు మాత్రం.. ఎవరికి వారే వాళ్ల మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందొచ్చు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? మనుషులు అనుకుంటే సాధ్యం కానిది ఏం ఉంటుంది అనుకున్నారో లేక.. టెక్నికల్ ప్రాబ్లమో తెలియదు కానీ Mecklenburg County ప్రజలకు మాత్రం ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 



ఆన్‌లైన్‌లో డెత్ సర్టిఫికెట్‌ను పొందే పోర్టల్‌లో ఓ ప్రశ్న కనిపిస్తోంది. ఎవరి మరణ ధృవీకరణ పత్రాన్ని పొందాలనుకుంటున్నారు..? అన్న ప్రశ్న అది. దీనికి విచిత్రంగా రెండు ఆప్షన్స్‌ను ఈ పోర్టల్‌లో ఇచ్చారు. అందులో ఒక ఆప్షన్ ‘My Self’.. అంటే నా మరణ ధృవీకరణ పత్రాన్ని నేనే పొందాలనుకుంటున్నాను అన్నట్టుగా అర్థాన్ని సూచిస్తోంది. అసలు ఇదెలా సాధ్యం.. చనిపోయిన వ్యక్తి తన మరణ ధృవీకరణ పత్రం కోసం ఎలా దరఖాస్తు చేసుకుంటాడు.? అని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. ప్రస్తుతం బతికి ఉన్న వ్యక్తి గత జన్మలో తాను మరణించిన దానికి సంబంధించి డెత్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఆప్షన్ ఇచ్చారేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 


అంతేకాకుండా దాని ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా.. Anand Mahindra కంట పడింది. దీంతో.. మరణానంతర జీవితాన్ని అక్కడి ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని.. అందువల్లే ముందు జన్మలకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం కోసం ప్రజలు అప్లై చేసుకోవడానికి వీలుగా అక్కడి అధికారులు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చారేమో అనే అర్థం వచ్చేలా ‘మరణానంతర జీవితాన్ని విశ్వసించే సంస్కృతి కేవలం మనకొక్కరికే సొంతం కాదన్నమాట’ అని చమత్కరిస్తూ ట్వీట్ పెట్టారు. దీంతో ఆ ట్వీట్ కాస్తా వైరల్ అయింది.




Updated Date - 2022-07-27T21:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising