ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎప్పటిలాగే ఈసారి కూడా.. అద్భుతమైన వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర!

ABN, First Publish Date - 2022-12-02T13:20:25+05:30

చూడటానికి బైక్‌లా కనిపిస్తున్నా.. పొడగవుగా ఆరు సీట్లను కలిగి ఉన్న ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంది. కాగా.. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

చూడటానికి బైక్‌లా కనిపిస్తున్నా.. పొడగవుగా ఆరు సీట్లను కలిగి ఉన్న ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఐరోపా దేశాల్లో టూర్ బస్సులా పని చేసే ఈ తరహా వాహనాన్ని.. చిన్నపాటి మార్పులు చేసి అంతర్జాతీయంగా వాడుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణరంగ ఆవిష్కరణలు ఎప్పుడూ నన్ను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అవసరాలే ఈ ఆవిష్కరణలకు మూలం’ అని పేర్కొన్నారు. దీంతో ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఆ వాహనాన్ని ఒకసారి ఛార్జింగ్ పెడితే.. 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చట. కేవలం రూ.10వేల నుంచి రూ. 12వేల ఖర్చుతో దీన్ని తయారు చేయవచ్చంటూ కుర్రాడు చేసిన వ్యాఖ్యలను వీడియోలో చూడవచ్చు.

Updated Date - 2022-12-02T15:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising