ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఆటో డ్రైవర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. మరో వైరల్ వీడియోతో వచ్చేసిన ఆనంద్ మహీంద్రా

ABN, First Publish Date - 2022-01-24T01:03:19+05:30

మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా చైర్ పర్సన్ ఆనంద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. అందులోనూ స్ఫూర్తినిచ్చే వీడియోలు షేర్ చేయడంలో ఆయన అందరికంటే ముందే ఉంటారు. తాజాగా ‘ది బెటర్ ఇండియా’ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియోను రీ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈవో సుమన్ మిశ్రాను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని  పేర్కొన్నారు.

 

ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేసిన ఆ వీడియో చెన్నైలోని ఓ ఆటో డ్రైవర్‌కు సంబంధించినది. ఆ వీడియోలో అతడి మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ‘‘అన్నాదురై  ఏ బిజినెస్ స్కూలు నుంచి ఎలాంటి డిగ్రీ తీసుకోలేదని, వ్యాపార నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆయన వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాదని పేర్కొంది. కానీ ఆయనకి మొదటి నుంచి ‘వినియోగదారుడే రాజు’ అన్న విషయం తెలుసని ‘బెటర్ ఇండియా’ ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించింది.

 

ఇదే వీడియోను రీ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎంబీయే విద్యార్థులు కనుక అన్నాదురైతో ఒక రోజు తిరిగితే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్‌లో అది కుదించిన కోర్సు అయిపోతుందని పేర్కొన్నారు. అతడు ఆటో డ్రైవర్ మాత్రమే కాదని, మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అని ప్రశంసలు కురిపించారు. వైరల్ అయిన ఈ వీడియోను చూస్తున్న వారు అన్నాదురైని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ ఆటోడ్రైవర్ చేసిన ఘనతేంటో చెప్పనే లేదు కదూ.. తినబోతూ రుచి చూడడం ఎందుకు? మీరూ చూసేయండి మరి!




Updated Date - 2022-01-24T01:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising