ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Newly Married: పాపం ఈ అమ్మాయి.. తన కంటే వయసులో పదేళ్లు పెద్దైనా పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటే..

ABN, First Publish Date - 2022-08-13T22:32:03+05:30

ఆ యువతి వయసు 22 సంవత్సరాలు. మూడు నెలల క్రితం ఆమెకు తల్లిదండ్రులు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. ఎన్నో కొత్త ఆశలతో వైవాహిక బంధంలోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దావణగెరె: ఆ యువతి వయసు 22 సంవత్సరాలు. మూడు నెలల క్రితం ఆమెకు తల్లిదండ్రులు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. ఎన్నో కొత్త ఆశలతో వైవాహిక బంధంలోకి ఆ యువతి అడుగుపెట్టింది. కానీ.. అత్తింటి వారి వరకట్న దాహం ఆ యువతి ఆశలను కూల్చేసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింట్లో వాళ్లు వేధించడంతో ప్రాణాలు తీసుకుందో లేక మరేమైనా జరిగిందో గానీ విషం తాగి ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకాలోని మియాపూర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రూప అనే యువతికి, అదే ప్రాంతానికి చెందిన గంగాధర్ అనే 32 ఏళ్ల వ్యక్తికి  మూడు నెలల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరిగింది.



పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో వరుడి కుటుంబానికి కట్నం భారీగానే ముట్టజెప్పి పెళ్లి కూడా ఘనంగా చేశారు. అమ్మాయి రూపవతి, గుణవతి కూడా కావడంతో అబ్బాయి కోరి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పదేళ్ల వయసు తేడా ఉన్నా అమ్మాయి కూడా అతనిని ఇష్టపడటంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. పెళ్లయిన కొన్ని రోజులు బాగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత అదనపు కట్న వేధింపులతో అల్లకల్లోలంగా మారింది. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తకు చెప్పుకున్నా ఫలితం లేకుండాపోయింది. వేధింపులు మరింత పెరిగిపోవడంతో రూప విషం తాగింది.



ఆమె చనిపోతే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన రూప భర్త గంగాధర్, అతని కుటుంబం రూపను ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్‌లో చేర్చిన 2 రోజులకు ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి విషయం చెప్పారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రూప ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. రూప మృతికి కారణమైన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి కూతురి మృతదేహంతో వెళ్లిపోయారు. అత్తారింటికి కొత్తగా కాపురానికి వెళ్లిన కూతురు విగత జీవిగా కనిపించడంతో రూప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ పరిస్థితి ఏ ఆడబిడ్డకూ రాకూడదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రూప తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-13T22:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising