ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6ఏళ్ల క్రితం తల్లితో కొడుకు ఛాలెంజ్.. మాట ప్రకారమే ఇన్నేళ్లూ వాటికి దూరం.. చివరకి రూ.1.35లక్షలు గెలుచుకున్న కుర్రాడు!

ABN, First Publish Date - 2022-02-28T00:24:15+05:30

ఆరేళ్ల క్రితం ఆ టీనేజీ కుర్రాడు తల్లికి ఛాలెంజ్ విసిరాడు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కొన్నేళ్లుగా అన్నింటినీ దూరం పెట్టాడు. చివరికి విజయం అతడి సొంతమైంది. రూ.1.35లక్షలు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో కొడుకు విజయంలోనే అతడి తల్లి కూడా తన గెలుపును చూసుకుని ఆనందం వ్యక్తం చేస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆరేళ్ల క్రితం ఆ టీనేజీ కుర్రాడు తల్లికి ఛాలెంజ్ విసిరాడు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కొన్నేళ్లుగా అన్నింటినీ దూరం పెట్టాడు. చివరికి విజయం అతడి సొంతమైంది. రూ.1.35లక్షలు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో కొడుకు విజయంలోనే అతడి తల్లి కూడా తన గెలుపును చూసుకుని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంతకూ విషయం ఏంటంటే.. 



అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన లోర్నా గోల్డ్‌స్ట్రాండ్‌ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు ఓ కూతురు, కొడుకు జన్మించారు. కొన్నేళ్ల కిందటే టీనేజీలోకి అడుగుపెట్టిన లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ కూతురు.. సోషల్ మీడియాకు బానిసైంది. ఎల్లప్పుడూ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేసేది. అది చూసి లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన కొడుకు సైవర్ట్ క్లైఫ్సాస్ కూడా సోషల్ మీడియాలో ఇరుక్కుపోవడం ఆమెకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో 2016లో 12ఏళ్ల సైవర్ట్ క్లైఫ్సాస్‌తో పందెం కట్టింది. ఆరేళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానంటూ ఆఫర్ చేసింది. లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ విసిరిన ఛాలెంజ్‌కు సైవర్ట్ క్లైఫ్సాస్ సై అన్నాడు. ఇందులో భాగంగా ఆరేళ్లపాటు సోషల్ మీడియాను దూరం పెట్టాడు. ఫలితంగా తల్లితో చేసిన ఛాలెంజ్‌లో విజయం సాధించి.. 1800 డాలర్లు (సుమారు రూ.1.35లక్షలు) గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తన ఆనందం వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం తన కొడుకు ఆరేళ్లపాటు సోషల్ మీడియా జోలికి వెళ్లలేదని చెప్పింది. ఇపుడు తన సైవర్ట్ క్లైఫ్సాస్ సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేయొచ్చని పేర్కొంది.



Updated Date - 2022-02-28T00:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising