ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఎయిర్ హోస్టెస్ కెరియర్ సుదీర్ఘం.. విమానమార్గం ఎంచుకునే ఆవకాశం ఆమె సొంతం!

ABN, First Publish Date - 2022-07-03T13:38:12+05:30

ప్రపంచంలో చాలా మంది తాముచేసే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో చాలా మంది తాముచేసే ఉద్యోగాన్ని అమితంగా ఇష్టపడతారు. అయితే బలవంతంగా పని చేసే వారు తమ ఉద్యోగాన్ని ఇష్టపడరు. వారు డబ్బు కోసమే పని చేస్తారు. అయితే ఉద్యోగాన్ని ఇష్టపడి చేసినప్పుడు అది చాలా సరదాగా ఉంటుంది. అప్పుడు ఉద్యోగం భారంగా అనిపించదు. ఇలా తన ఉద్యోగాన్ని ప్రేమించడం వల్లే బెట్టే నాష్ ప్రపంచ రికార్డు సృష్టించారు. వృత్తిరీత్యా ఎయిర్‌హోస్టెస్ అయిన బెట్టే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఎయిర్ హోస్టెస్‌గా పేరుపొందిందారు. 


86 ఏళ్ల బెట్టే పేరు ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరారు. ఆమెకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె తన జీవితంలో 65 ఏళ్లు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. బెట్టే నిజానికి మసాచుసెట్స్‌కు చెందిన మహిళ. 1957లో ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఏబీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం బెట్టేకి ఎయిర్‌లైన్స్.. నచ్చిన విమాన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించింది. ఆమె ఎప్పుడూ న్యూయార్క్-బోస్టన్-వాషింగ్టన్ డీసీ మార్గాన్నే ఎంచుకుంటారు. దీని వెనుక కారణం ఆమె కుమారుడు. ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆమె తన కుమారుని ఇంటికి వెళ్లగలుగుతుంది. బెట్టే కుమారుడు వికలాంగుడు. అతనిని ఒక సంరక్షకుడు చూసుకుంటాడు. ఎయిర్‌లైన్స్‌లో చేరే కొత్త ఫ్లైట్ అటెండెంట్‌లకు బెట్టే పలు సూచనలు చేశారు. ఈ ఉద్యోగంలో మానవత్వానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నంత కాలం పనిచేస్తానని తెలిపారు.  

Updated Date - 2022-07-03T13:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising