ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఊర్లో ఆడవారిదే పెద్దరికం.. అన్ని ఇళ్లూ వారివే.. ఇంతకీ ఆ ఊరెక్కడుందో తెలుసా..

ABN, First Publish Date - 2022-03-09T00:54:43+05:30

అక్కడ ఏ ఇంట్లో చూసినా మహిళలదే అధికారం. ప్రతి ఇల్లూ వారి పేరు మీదే ఉంటుంది. ఇలాంటి సంప్రదాయం ఎందుకు వచ్చింది, ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఇంట్లో సాధారణంగా మగవారిదే అధికారం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు భర్తలు చెడు అలవాట్లకు బానిసలై.. డబ్బులు మొత్తం ఖర్చు చేస్తుంటారు. ఆఖరికి భార్యల మెడలోని మంగళసూత్రాలను కూడా వదలరు. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే గ్రామంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అక్కడ ఏ ఇంట్లో చూసినా మహిళలదే అధికారం. ప్రతి ఇల్లూ వారి పేరు మీదే ఉంటుంది. ఇలాంటి సంప్రదాయం ఎందుకు వచ్చింది, ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..


మహారాష్ట్రాలోని జౌరంగాబాద్‌ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బాకాపూర్‌లో మహిళలే మహరాణులు. ఈ గ్రామాన్ని 2008లో పంచాయతీగా చేశారు. సుమారు రెండు వేల కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఇంట్లో ఏ పని చేయాలన్నా భార్య నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి ఇల్లు మహిళల పేరుతో ఉంటుంది. ఒకవేళ అత్యవర సమయంలో ఇల్లును అమ్మాలన్నా భార్య అనుమతి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడి పంచాయతీ రికార్డుల్లో కూడా ఇంటి యజమానిగా మహిళ పేరు ఉంటుంది. స్త్రీ, పురుష సమానత్వం పాటించడంలో తమ గ్రామం ముందుంటుందని సర్పంచ్ (గ్రామాధికారి) కవితా సాల్వే తెలిపింది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను మహిళలు చూసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పింది. గ్రామంలో ఈ నిర్ణయం తీసుకునే సమయంలో సర్పంచ్‌గా సుదాంరావు పలాస్కర్‌ అనే వ్యక్తి ఉండేవారు.

నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి.. చివరకు..


ఆ సమయంలో గ్రామంలో చాలా మంది భర్తలు జల్సాలకు అలవాటు పడి.. డబ్బుల కోసం చివరకు ఇల్లు కూడా అమ్మేసేవారట. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవట. దీంతో సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటిని మహిళల పేరుతో రిజిస్టర్ చేయించారు. పిల్లల భవిష్యత్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రతిపాదనకు అంతా మద్దతు ఇచ్చారని పలాస్కర్‌ తెలిపారు. మహిళలకు అధికారం ఇవ్వడం వల్ల ప్రస్తుతం గ్రామంలోని చాలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని గర్వంగా చెబుతున్నారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ఈ గ్రామస్తులు.. చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2022-03-09T00:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising