ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం.. తమ జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూళ్ళేదంటూ ట్వీట్..

ABN, First Publish Date - 2022-12-10T11:45:02+05:30

టిష్యూ పేపర్‌ను తెరవగా అందులో కనిపించింది చూసి ఆమె విస్తుపోయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ మహిళ లండన్ నుండి దుబాయ్‌కి బ్రిటీష్ ఎయిర్ వేస్‌లో ప్రయాణం చేస్తోంది. సాధారణంగా విమానాల్లో ప్రయాణికులకు ఫుడ్, డ్రింక్స్ అందిస్తూ ఉంటారు. అదే విధంగా ఆమెకు కూడా విమానంలో భోజనం అందించారు. అయితే ఆమె భోజనం పార్శల్ ఓపెన్ చేయగానే బ్రోకలి, అన్నంతో పాటు దాని ప్రక్కన ఓ టిష్యూ పేపర్ కనిపించింది. ఆ మహిళ టిష్యూ పేపర్‌ను తెరవగా అందులో కనిపించింది చూసి ఆమె విస్తుపోయింది. 'తినే పదార్థాలలో ఇలాంటి భయంకరమైనవి కూడా పెట్టి ఇస్తారా?' అంటూ ఎయిర్ వేస్ వారిని ట్యాగ్ చేస్తూ తన భోజనం ప్లేట్ ఫొటో‌కు సంబంధించిన ఫొటోను జతచేసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇంతకూ ఆమెకు టిష్యూ పేపర్లో ఏం కనిపించిదంటే దంతం.

దంత వైద్యుల దగ్గరకు సహజంగా పన్ను నొప్పి అని వెళితే పుచ్చు పన్నును పీకేస్తారు. అలా పీకేసిన ఓ దంతం సదరు ప్రయాణికురాలి భోజనం పార్శల్‌లోకి చేరింది. భోజనం ప్లేట్లో బ్రోకలి, అన్నంతో పాటు టిష్యూ పేపర్‌లో దవడ భాగం దంతం కనిపించడంతో ఆ మహిళ భయాందోళనలకు గురైంది. 'నేను ఇలాంటివి ఎక్కడా చూడలేదు.. వినలేదు కూడా' అంటూ తన మనోవేదనను బయటపెట్టింది. ఎయిర్ లైన్‌ను ట్యాగ్ చేయడంతో.. ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. 'హాయ్ మీకు ఇలా జరిగినందుకు క్షమించండి. మీరు మీ వివరాలను అందిస్తే మా సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు' అని ఆమెకు బదులిచ్చారు.

ఇదంతా చూసిన నెటిజన్లు 'తినే పదార్థాలలో బొద్దింకలు, తల వెంట్రుకలు, చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి కనిపించడం చూశాం కానీ ఏకంగా ఇలా మనిషి దంతం రావడం ఏంటి చోద్యం కాకపోతే' అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-10T11:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising