ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AGREEMENT WEDDING: కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌.. నెట్టింట తెగ హల్‌చల్‌..!

ABN, First Publish Date - 2022-07-16T21:55:29+05:30

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు(weddings), ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. కొందరయితే సంప్రదాయాలను బ్రేక్‌ చేస్తూ.. కాంట్రాక్ట్‌ పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు(weddings), ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. కొందరయితే సంప్రదాయాలను బ్రేక్‌ చేస్తూ.. కాంట్రాక్ట్‌ పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. తాజాగా అస్సాంలో ఓ జంట కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ చేసుకుంది. అందులో సవాలక్ష కండీషన్లు ఉన్నాయి. ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌(Agreement)లో ఏముందంటే... నెలకు ఒకసారి మాత్రమే పిజ్జా తినాలి.. ఇంట్లో వంటనే తినాలి.. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి.. ప్రతిరోజూ చీర కట్టుకోవాలి.. 15 రోజులకోసారి మాత్రమే షాపింగ్‌ చేయాలి.. ప్రతి పార్టీలో మంచి ఫొటోస్‌ తీసుకోవాలి అంటూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.


ఎర్రని లెహంగాలో వధువు, తెల్లని పెళ్లి దుస్తుల్లో వరుడు కాంట్రాక్ట్‌ పేపర్‌పై సంతకం పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియా(Social media)లో వైరల్‌(viral)గా మారింది. వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ సంస్థ వెడ్‌లాక్‌... పోస్ట్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ బాగుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరొకరు అయితే ప్రతిరోజూ చీర అంటే టూ మచ్‌ అని కామెంట్‌ చేశారు. మరికొందరైతే ఇదేం పద్ధతి అంటూ మండిపడుతున్నారు.

Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..



Updated Date - 2022-07-16T21:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising