ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: వామ్మో.. ఈ స్వీటు చాలా ఖరీదు.. కేజీ రూ.25 వేలు.. అయినా వెనక్కి తగ్గని జనం.. ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-04T16:54:31+05:30

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్వీటు షాపులో తయారైన స్వీటుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌(Viral)గా మారాయి. ఆ స్వీటు ఖరీదు కేజీ రూ.25వేలు కావడమే ఇందుకు కారణం. అయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్వీటు షాపులో తయారైన స్వీటుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌(Viral)గా మారాయి. ఆ స్వీటు ఖరీదు కేజీ రూ.25వేలు కావడమే ఇందుకు కారణం. అయినా.. ప్రజలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎగబడి మరీ దాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ స్వీట్ ప్రత్యేక ఏంటి? అదెక్కడ తయారు చేశారు? ప్రజలు ఎందుకు ఎగబడి మరీ దాన్ని కొనుగోలు చేస్తున్నారు? వంటి వివరాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


స్థానికంగా రాఖీ పౌర్ణమి అనే జరుపుకునే పండుగను.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రక్షాబంధన్(Raksha Bandhan) పేరుతో వేడుకలు చేసుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా.. వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించి లాభాలు పొందుతారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ఆగ్రా(Agra)కు సంబంధించిన ఓ మిఠాయి దుకాణం యజమాని.. రాజస్థాన్ సంప్రదాయ మిఠాయిని స్పెషల్‌‌గా తయారు చేసి స్థానికులను అట్రాక్ట్ చేస్తున్నారు.



బ్రజ్ రసయన్ మిఠాయి భండార్(Braj Rasayan Mitthan Bhandar) యజమాని.. పాలు, నేయ్యి, పండి, చెక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో ఘేవార్(Ghevar)ను తయారు చేసి.. దానిపై 24 క్యారెట్ల బంగారు పూత వేస్తున్నారు. ఇలా తయారు చేసిన Ghevar‌ ధర కేజీ రూ.25వేలుగా ఫిక్స్ చేశాడు. కాగా.. స్వీట్ షాప్‌కు వచ్చిన కస్టమర్లు.. బంగారు పూతతో మెరిసిపోతున్న Ghevar‌ను చూసి ముచ్చటపడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్బులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ స్వీట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేజీల స్వీటును అమ్మినట్టు సదరు యజమాని పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-08-04T16:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising