ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్ల క్రితం నిషేధం.. చివరకు తనేంటో నిరూపించుకున్న ఎవరెస్ట్ అధిరోహకుడు!

ABN, First Publish Date - 2022-06-04T21:17:00+05:30

ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించాలని ఎంతో మంది పర్వతారోహకులు కలలు కంటూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించాలని ఎంతో మంది పర్వతారోహకులు కలలు కంటూ ఉంటారు. ఇప్పటికి చాలా మంది ఎన్నో కష్టనష్టాలకోర్చి తమ కలను నెరవేర్చుకున్నారు. భారతీయ అధిరోహకుడు నరేందర్ సింగ్ యాదవ్ కూడా 2016లో తాను ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించినట్టు ప్రకటించాడు. 2016 మే నెలలో 8,849 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకున్నట్టు చెప్పాడు. అయితే అందుకు సాక్ష్యంగా చూపించిన ఫొటోలు మార్ఫింగ్ చేసినట్టుగా నేపాల్ ప్రభుత్వ అధికారులు భావించారు. అతడితోపాటు మరో ఇద్దరు అధిరోహకులపై ఆరేళ్ల పాటు నిషేధం విధించారు. 


నరేందర్‌పై విధించిన ఆరేళ్ల నిషేధం ఈ ఏడాది మే 20తో ముగిసింది. వారం రోజుల గ్యాప్ తర్వాత నరేందర్ మళ్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈసారి తన ఘనతను నిరూపించుకోవడానికి అవసరమైన ఫోటోలు, వీడియోలను చూపించాడు. దీంతో నేపాల్ పర్యాటక శాఖ అధికారి.. నరేందర్‌కు ఎవరెస్ట్ అధిరోహకుడిగా సర్టిఫికెట్ బుధవారం అందించారు.

Updated Date - 2022-06-04T21:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising