ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడిలో ప్రసాదం తింటూ.. రోడ్డు పక్కన పడుకుంటున్న నలుగురు బాలికలు.. మీరెవరని స్థానికులు అడిగితే..!

ABN, First Publish Date - 2022-05-20T22:19:17+05:30

ఆ నలుగురు బాలికలు నెల రోజులుగా గుడిలోనే ఉంటున్నారు.. ఎవరైనా ఏమైనా ఇస్తే తింటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ నలుగురు బాలికలు నెల రోజులుగా రోడ్డు పక్కనే ఉంటున్నారు.. గుడిలో ప్రసాదం ఇస్తే తింటున్నారు.. లేదంటే పస్తులుంటున్నారు.. కొన్నిరోజులుగా వారిని చూసిన స్థానికులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.. కన్న తల్లి, సవతి తండ్రి ఇంటి నుంచి బయటకు తరిమేయడంతో వారు రోడ్డున పడినట్టు తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులకు ఆ నలుగురు బాలికలు తమ కథ చెప్పారు. 

ఇది కూడా చదవండి..

కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేశానన్న 22 ఏళ్ల యువతి.. ఆమె కథంతా విని..


బీహార్‌లోని ముంగర్‌కు చెందిన ఆ నలుగురు బాలికలు ఒకే తల్లికి జన్మించారు. ఆ నలుగురు బాలికలకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఏడాది క్రితం వారి తండ్రి ఓ ప్రమాదంలో మరణించాడు. రెండు నెలల తర్వాత తల్లి పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను భార్యతో పాటు ఐదుగురు పిల్లలను తనతో పాటు తీసుకెళ్లాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అబ్బాయిని మాత్రం ఇంట్లో ఉంచి, బాలికలను బయటకు గెంటేశాడు. ఆ తల్లి వారికి కేవలం 400 రూపాయలు ఇచ్చి బీహార్‌ వెళ్లే ట్రైన్ ఎక్కించింది. ఆ నలుగురు బాలికలు ముంగర్‌కు తిరిగి వచ్చారు. 


అక్కడకు వెళ్లాక ఆ బాలికలకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. దీంతో ఆ నలుగురిలో పెద్దదైన సంజు కుమారి (13) చెల్లెళ్లను తీసుకుని ఓ గుడికి చేరింది. ఎవరైనా తినడానికి ఇస్తే చెల్లెళ్ల ఆకలి తీర్చేది. ఆ గుడికి సమీపంలోని రోడ్డు పక్కన ఆ నలుగురూ రోజులు గడుపుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ నలుగురినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఆ నలుగురి బాలికల తల్లి గురించి అన్వేషిస్తున్నారు.   

Updated Date - 2022-05-20T22:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising