ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భంలో ఉన్న శిశువుకు రుచి తెలుస్తుందా..? తల్లి క్యారెట్లు తింటే.. కడుపులో ఉన్న శిశువు రియాక్షన్‌ ఇదీ..!?

ABN, First Publish Date - 2022-09-24T02:26:15+05:30

సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి తప్ప పచ్చి కూరగాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి తప్ప పచ్చి కూరగాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు. పిల్లలే కాదు, పెద్దలు కూడా బచ్చలికూర, బెండకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటి కూరలను తినడానికి అంత ఇష్టపడరు. అయితే శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న ఓ విషయం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.  ఆహారం పట్ల ఈ ఇష్టాయిష్టాలు అనేవి తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలవుతాయట. తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టి గర్భంలోని పిండం ముఖ కవళికలు మారిపోతాయట. ఇంగ్లండ్‌కు (England) చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. 


ఇది కూడా చదవండి..

Viral Video: నిజంగా ఈ డాక్టర్‌కు దండం పెట్టాల్సిందే.. అప్పుడే పుట్టిన పాపకు ఆక్సిజన్ పెట్టినా చలనం లేకపోవడంతో..


డర్హామ్ విశ్వవిద్యాలయ అధ్యయనం (Durham University study) ప్రకారం.. గర్భంలో పిండంగా ఉన్న దశలోనే రుచి, వాసనను ( fetuses Knows taste and smell) బట్టి భిన్నంగా స్పందించడం ప్రారంభమవుతుందని వెల్లడైంది. ఆహారానికి సంబంధించి వారి ఇష్టాయిష్టాలు పుట్టకముందే అభివృద్ధి చెందుతాయయట. 100 మంది మహిళలపై పరిశోధన చేసి 4డీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న మహిళలందరూ 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగినవారు. అలాగే వారందరూ 32 నుంచి 36 వారాల గర్భంతో ఉన్నవారు. 


వీరిలో 35 మంది మహిళలకు ముదురు రంగు క్యాబేజీతో తయారు చేసిన క్యాప్సూల్స్, 35 మంది మహిళలకు క్యారెట్‌తో తయారు చేసిన క్యాప్సూల్స్ ఇచ్చారు. మిగిలిన 30 మంది మహిళలకు ఏమీ ఇవ్వలేదు. అనంతరం వారందరికీ స్కానింగ్ చేశారు. క్యాప్సూల్స్ తినిపించిన 20 నిమిషాల తర్వాత వారిని స్కాన్ చేయగా.. క్యారెట్ (Carrot)క్యాప్సూల్స్ తిన్న మహిళల గర్భాల్లో ఉన్న పిల్లల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ఇక, క్యాబేజీ క్యాప్సూల్స్ తిన్న మహిళల గర్భాల్లోని పిల్లల ముఖాలు విచారంగా ఉన్నాయి.

Updated Date - 2022-09-24T02:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising