ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుద్రాక్షకు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ABN, First Publish Date - 2022-04-09T17:41:32+05:30

రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి మీరు చాలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి మీరు చాలా చోట్ల చదివే ఉంటారు. అలాగే మీరు చాలా మంది సాధువుల మెడలో రుద్రాక్ష మాలను ఉండటం కూడా చూసే ఉంటారు.  గుండ్రంగా  కనిపించే రుద్రాక్షకు హిందూ విశ్వాసాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది దానిని పూజించి తమ వద్ద ఉంచుకుంటారు. అయితే, ఇంతకీ రుద్రాక్ష అంటే ఏమిటో తెలుసా? ఇందులో ఏకముఖి, ద్విముఖి లేదా పంచముఖి అనే రుద్రాక్షలు ఉంటాయని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి రుద్రాక్ష అనేది ఒక పండుకు చెందిన విత్తనం. 


ఇది యంత్రాల సహాయంతో లేదా ఏ కళాకారుల సహాయంతోనూ తయారుకారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, ఇది చాలా పవిత్రమైన పూసగా గుర్తింపుపొందింది. రుద్రాక్షను శివునితో అనుబంధం కలిగిన దానిగా భావిస్తారు. 'రుద్ర' అనే పదం శివునికి సంబంధించినది. అక్షం అంటే కన్ను లేదా కన్నీరు. అందుకే చాలా మంది దీనిని శివుని కన్నీటిగా భావిస్తారు. ఈ కారణంగానే దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. రుద్రాక్ష తయారయ్యే ప్రక్రియ పూర్తిగా సహజమైనది ఇది మొదట  గుండ్రని పండ్ల రూపంలో పెరుగుతుంది. మొదట ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని తరువాత పండినప్పుడు, అది నీలం లేదా ఆకాశం రంగులోకి మారుతుంది. దీని నీలి రంగు కారణంగా దీనిని బ్లూబెర్రీ పూసలు అని కూడా అంటారు. ఈ చెట్లు చాలా పొడవుగా ఉంటాయి. నేపాల్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, హిమాలయాలు, గంగా మైదానాలలో ఇవి కనిపిస్తాయి. ఈ పండు చెట్టుపై పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది సాధారణ పండ్లలాగా కొన్ని నెలలలో కాదు.. 3-4 సంవత్సరాలలో పరిపక్వం చెందుతుంది.  రుద్రాక్షకు ఎన్ని ముఖాలు ఉంటాయో ఆ రుద్రాక్ష రేఖలే తెలియజేస్తాయి. ఈ ముఖాలు 1 నుంచి 21 వరకు ఉంటాయి. 



Updated Date - 2022-04-09T17:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising