ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి విషయంలో తల్లిదండ్రులపై సీఎంకు ఫిర్యాదు చేసిన యువతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ తర్వాత!

ABN, First Publish Date - 2022-02-14T00:14:23+05:30

పెళ్లి విషయంలో ఓ యవతి తల్లిదండ్రులపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత అధికారులు దగ్గరుండి మరీ ఆమె పెళ్లి జరిపించిన ఘటన చత్తీస్‌గడ్‌లో చో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి విషయంలో ఓ యవతి తల్లిదండ్రులపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత అధికారులు దగ్గరుండి మరీ ఆమె పెళ్లి జరిపించిన ఘటన చత్తీస్‌గడ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాకు చెందిన మనీషా ఉన్నత చదువులు చదివింది. ఎంఏ పూర్తి చేసిన ఈ యువతికి సూరజ్‌పూర్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. చివరకు ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పి, వారి అంగీకారంతో ఇరువురూ పెళ్లికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే తొలుత కూతురి వివాహానికి ఓకే చెప్పిన మనీషా తల్లిదండ్రులు తర్వాత అడ్డు చెప్పారు. శైలేంద్రతో కాకుండా మరొకరితో కూతురి పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో మనీషా తన తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులపై ఫిర్యాదు చేస్తూ.. చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ సహా ఐజీకి లేఖ రాసింది. దీంతో పోలీసులు స్పందించారు. మనీషా తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. వారికి సర్దిచెప్పి, పెళ్లికి ఒప్పించారు. అంతేకాకుండా పోలీసులే దగ్గరుండి మరీ శైలేంద్రతో మనీషా పెళ్లి జరిపించారు. కాగా.. పెళ్లి జరిగిన తీరు స్థానికంగా చర్చనీయాంశం అయింది.



Updated Date - 2022-02-14T00:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising