ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడిలో వీళ్లిద్దరూ ఇలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు కానీ.. ఆ యువతి అతడి వద్దకు చేరడానికి ఎన్ని కష్టాలు పడిందంటే..

ABN, First Publish Date - 2022-09-03T23:42:20+05:30

వారిద్దరి ప్రాంతాలు వేరు, కులమతాలు కూడా వేరు. కానీ అనుకోకుండా ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుని కలిసి జీవితాంతం బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు యువతి కుటుంబ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరి ప్రాంతాలు వేరు, కులమతాలు కూడా వేరు. కానీ అనుకోకుండా ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుని కలిసి జీవితాంతం బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయినా యువతి మాత్రం అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు ఇద్దరూ కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రియుడి వద్దకు వెళ్లేందుకు.. యువతి అష్టకష్టాలు పడింది. తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


యూపీలోని (UP) బిజ్నోర్ ప్రాంతానికి చెందిన సిద్రా నాజ్‌కి, బీహార్ (Bihar) సమస్తిపూర్‌లోని సింధియా పరిధి బిహత్ గ్రామానికి చెందిన కైలాష్‌ చంద్రతో పరిచయం ఏర్పడింది. కైలాష్‌ చంద్ర జీవనోపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు వెళ్లాడు. అక్కడ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని సిద్రా నాజ్‌తో ప్రేమలో (Fell in love) పడ్డాడు. సిద్రా తన కుటుంబ సభ్యులకు తెలీకుండా కైలాష్‌ను కలుస్తూ ఉండేది. అయితే తర్వాత ఈ విషయం సిద్రా తల్లిదండ్రులకు తెలిసింది. ఇద్దరి కుల, మతాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. గొడవలు జరగడంతో కైలాష్.. గత నెలలో సొంతూరుకి వచ్చేశాడు. అయితే సిద్రా మాత్రం ప్రియుడిని మర్చిపోలేకపోయింది.

9 ఏళ్ల క్రితం పెళ్లి.. అప్పటికే ముగ్గురు కూతుళ్లు.. కొడుకు కోసం ఆ తండ్రి ఆశపడితే నాలుగోసారి ఒకే కాన్పులో ముగ్గురు కూతుళ్లు..!


ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో తెలీకుండా 1000కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడి గ్రామానికి బుధవారం చేరుకుంది. తర్వాత సిద్రా, కైలాష్.. బంధువల సమక్షంలో గుడిలో వివాహం చేసుకున్నారు. సిద్రా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం బిహత్ గ్రామానికి వెళ్లి, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు ఒకరంటే ఒకరికి ఇష్టమని, ఇద్దరూ మేజర్లమని, కలిసి జీవించాలని అనుకుంటున్నామని తెలిపారు. తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని సిద్రా నాజ్‌ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

భార్య చనిపోయిన నెల తర్వాత వీడియో విడుదల చేసిన భర్త.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే..



Updated Date - 2022-09-03T23:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising