ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిశ్చితార్థం పూర్తవగానే వరుడికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్‌ కాల్.. అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని..

ABN, First Publish Date - 2022-02-20T21:44:30+05:30

కుటుంబ సభ్యుల సమక్షంలో అతడు నిశ్చితార్థం జరుపుకున్నాడు. కార్యక్రమం ఘనంగా జరిగిందని ఆనందపడుతుండగానే గుర్తు తెలియని నెంబర్ నుంచి అతడికి ఫోన్ కాల్ వొచ్చింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యుల సమక్షంలో అతడు నిశ్చితార్థం జరుపుకున్నాడు. కార్యక్రమం ఘనంగా జరిగిందని ఆనందపడుతుండగానే గుర్తు తెలియని నెంబర్ నుంచి అతడికి ఫోన్ కాల్ వొచ్చింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి మాటలు విని అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. తర్వాత ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. ఎవరో ఆటపట్టిస్తున్నారని భావించాడు. కానీ పదే పదే ఫోన్లు రావడంతో కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన యువకుడికి స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో ఈ నెల 2న నిశ్చితార్థం అయింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో కార్యక్రమం బాగా జరిగిందని సంబరపడుతున్న క్రమంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి అతడికి కాల్ వచ్చింది. ఫోన్‌లో తనను తాను  రాజ్ కుమార్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాకయ్యాడు. తర్వాత ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. కానీ రాజ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం వరుడికి ఫోన్ చేయడాన్ని మానలేదు. పదే పదే ఫోన్ చేస్తూ.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకుంటే చంపేస్తానంటూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. దీంతో ఆ యువకుడు భయాందోళనలకు గురయ్యాడు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో 507 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.




Updated Date - 2022-02-20T21:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising