ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు పడిపోయిన వ్యక్తి.. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన ట్రైన్.. చివరికి..

ABN, First Publish Date - 2022-02-11T02:29:05+05:30

రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇంతలో ఓ వైపు నుంచి గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాలపై నుంచి పక్కకు వెళ్లే ఛాన్స్ అతడికి లేకుండా పోయింది. ఆ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇంతలో ఓ వైపు నుంచి గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాలపై నుంచి పక్కకు వెళ్లే ఛాన్స్ అతడికి లేకుండా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని గంగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ఢిల్లీ-ముంబై రైల్వే లైన్‌ను దాటే క్రమంలో ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. ఇంతలో ఓ వైపు నుంచి 70 బోగీల గూడ్స్ ట్రైన్ దూసుకొచ్చింది. దీంతో పట్టాలపై నుంచి పక్కకు వెళ్లేందుకు అతడికి ఏమాత్రం కూడా అవకాశం లభించలేదు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎటూ కదలకుండా పట్టాల మధ్యలో పడికుండిపోయాడు. అయితే 70 బోగీల ట్రైన్ అతడిపై నుంచి వెళ్లడం చూసిన స్థానికులు ఆశలు వదులుకున్నారు. అతడు బతికే ఛాన్సే లేదనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత ఆధార్ కార్డు సహాయంతో అతడిని దాల్‌చంద్ నాసియాగా గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు దాల్‌చంద్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.




Updated Date - 2022-02-11T02:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising