ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేస్తే.. పార్శల్‌లో కట్టలకొద్దీ డబ్బొచ్చింది!

ABN, First Publish Date - 2022-09-23T19:11:02+05:30

ఏదో పని మీద ఆమె బయటికెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో బాగా ఆకలి వేయడంతో.. దారిలో కనిపించిన కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ చికెన్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేసి.. కారులో ప్రయాణిస్తూనే దాన్ని తిందామనే ఉద్దేశంతో పార్శల్ తీసుకుని బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఏదో పని మీద ఆమె బయటికెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో బాగా ఆకలి వేయడంతో.. దారిలో కనిపించిన కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ చికెన్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేసి.. కారులో ప్రయాణిస్తూనే దాన్ని తిందామనే ఉద్దేశంతో పార్శల్ తీసుకుని బయటికొచ్చేసింది. తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టేసింది. అనంతరం శాండ్విచ్‌ను తినేందుకు పార్శల్‌ను ఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కవర్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..



అమెరికా(America)లోని జార్జియా రాష్ట్రానికి చెందిన జోన్నే ఆలివర్(Joanne Oliver).. తాజాగా ఓ పని మీద కారులో బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాగా ఆకలేసింది. ఏదైనా తిందామనే ఉద్దేశంతో.. దారిలో కనిపించిన కేఫ్‌సీ(KFC) రెస్టారెంట్‌కు వెళ్లి, అక్కడ చికెన్ శాండ్విచ్‌ను ఆర్డర్ చేసింది. అనంతరం పార్శల్ కవర్ తీసుకుని.. తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కారులో వెళ్తున్న క్రమంలోనే శాండ్విచ్ తినేందుకు పార్శల్‌ను ఓపెన్ చేసింది. తీరా పార్శల్ ఓపెన్ ఆమె షాకైంది. అందులో సుమారు రూ.43వేల విలువగల యూఎస్ డాలర్లు ఉండటంతో కంగుతింది. తర్వాత షాక్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో ఉండి కూడా ఆ డబ్బును తన అవసరాలకు వినియోగించుకోకూడదని భావించింది. వెంటనే పోలీసులను సంప్రదించి.. ఆ మొత్తాన్ని అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారులు నిజాయితీని చూసి మెచ్చుకున్నారు. 


Updated Date - 2022-09-23T19:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising