ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking.. ఇంట్లోనే కృత్రిమంగా గర్భం దాల్చిన మహిళ.. పండంటి మగబిడ్డకు జననం.. ఖర్చెంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-18T17:13:54+05:30

మాతృత్వం(motherhood) అనేది ప్రతి మహిళకు ఒక వరం. ఎన్నో కష్టాలకొర్చి తన మాంసాన్ని ముద్దగా మార్చి శిశువుకు జన్మనిస్తుంది తల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాతృత్వం(motherhood) అనేది ప్రతి మహిళకు ఒక వరం. ఎన్నో కష్టాలకొర్చి తన మాంసాన్ని ముద్దగా మార్చి శిశువుకు జన్మనిస్తుంది తల్లి. ఇక తల్లి కాలేని మహిళల బాధ వర్ణనాతీతం. వివిధ కారణాల వల్ల గర్భం ధరించలేని మహిళల కోసం కృత్రిమ గర్భధారణ ప్రక్రియతో పాటు సరోగసి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ గర్భధారణ(Artificial insemination) అనేది ఇన్-వివో ఫలదీకరణం( in-vivo fertilization) ద్వారా జరుగుతుంది. స్త్రీ గర్భాశయ కుహరం(female's cervix or uterine cavity)లోకి వీర్యాన్ని ఇంజెక్ట్ చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిని అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియకు కాస్త ఖర్చు ఎక్కువగానే అవుతుంది. 


కేవలం రూ.4 వేల ఖర్చుతో..


అయితే ఇటీవల ఒక 24 ఏళ్ల మహిళ 4,000 రూపాయల కంటే తక్కువ ధరతో DIY కిట్‌తో ఇంట్లోనే కాన్పు చేయించుకుంది. అమెరికాకు చెందిన బెయిలీ ఎన్నిస్ అనే మహిళ.. తల్లి కావాలని చాలా కాలంగా తపిస్తోంది. కానీ ఆమెకు పెళ్లి కాలేదు. అసలు ఒక మగతోడు కావాలన్న ఆసక్తి కూడా ఆమెలో లేదు. కానీ పిల్లలు కావాలి. దీనికోసం ఆమె  DIY ఇన్సెమినేషన్ కిట్‌(DIY insemination kit)ని ఎంచుకుంది. ఎటువంటి వృత్తిపరమైన సహాయం లేకుండానే స్వయంగా గర్భధారణ పొందింది. కట్ చేస్తే బెయిలీ గత నెల జూలైలో 2.32 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. Parents.com ప్రకారం, కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భం దాల్చడంలో సక్సెస్ రేటు ఐదు నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. 


అతనితో వాట్సాప్ చాట్ చేశా..


ఈ ప్రక్రియ ద్వారా సింగిల్ ఎటెమ్ట్‌లో గర్భం ధరిస్తే వారు అదృష్టవంతులే. ఇక ఖర్చు విషయానికి వస్తే.. క్లినిక్‌లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ యూఎస్‌లో అయితే $1,000 (రూ. 80,000) వరకూ ఉంటుంది. కృత్రిమ గర్భధారణ గురించి బెయిలీ ఎన్నిస్ మాట్లాడుతూ.. ‘‘నేను పూర్తి ఆరోగ్యవంతుడైన వ్యక్తిని గుర్తించాను. ఇద్దరు LGBTQ జంటలకు.. ఇంతకు ముందు మరో ఇద్దరికి దాతగా ఉన్నాను. ఆ తరువాత నేను నా దాతను ఎంచుకున్నా. తొలుత అతనితో వాట్సాప్ చాట్ చేశా. ఈ ప్రక్రియకు అంగీకరించడానికి ముందు అతన్ని ఒక కాఫీ షాపులో కలిశా’’ అని ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తెలిపింది. తాను ఎంచుకున్న దాత వచ్చి తనకు కిట్‌తో సహాయం చేశాడని బెయిలీ వెల్లడించింది. అతను తన డొనేషన్‌ను ఇవ్వడమే కాకుండా.. ఆ కిట్‌ను ఉపయోగించేందుకు తనకు సహాయం చేశాడని బెయిలీ ఎన్నిస్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో మొత్తంగా స్టెరైల్ కప్స్, సిరంజిలు, ఓవిలేషన్ టెస్ట్‌లు మాత్రమే ఉన్నాయని తెలిపింది.



Updated Date - 2022-08-18T17:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising