ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో..

ABN, First Publish Date - 2022-08-09T21:24:27+05:30

త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే తొందరలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వాహనాలను వేగంగా నడుపుతూ తాము ప్రమాదానికి గురవడమే కాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే తొందరలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వాహనాలను వేగంగా నడుపుతూ తాము ప్రమాదానికి గురవడమే కాకుండా.. పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెడుతుంటారు. ఇంకొందరైతే కదులుతున్న వాహనాలను ఎక్కే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకు కలిసి కదులుతున్న రైలును (moving train) ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయలో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ (woman constable) గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది..


పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) బంకురా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు తన కొడుకుతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే వారు వెళ్లాల్సిన రైలు అప్పటికే కదిలేందుకు సిద్ధంగా ఉంది. ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో రైలు వేగం మరింత పెరిగింది. అయినా బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వారిని గమనించి.. పరుగెత్తుకుంటూ వెళ్తుంది.  బోగీని పట్టున్న తల్లీకొడుకు అదుపుతప్పి.. ప్లాట్‌ఫామ్‌పై పడిపోతారు. మహిళా కానిస్టేబుల్.. వారిని పట్టుకుని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పుతుంది. మొత్తానికి తల్లీకొడుకు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళా కానిస్టేబుల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..





Updated Date - 2022-08-09T21:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising