ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్ గదిలో మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు..

ABN, First Publish Date - 2022-05-30T00:10:33+05:30

మహిళలను చూడగానే ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడే వారిని గతంలో ఎంతో మందిని చూశాం. అలాగే ప్రేమ పేరుతో మగవారిని ముగ్గులోకి దింపి, చివరకు మోసాలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలను చూడగానే ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడే వారిని గతంలో ఎంతో మందిని చూశాం. అలాగే ప్రేమ పేరుతో మగవారిని ముగ్గులోకి దింపి, చివరకు మోసాలకు పాల్పడే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు పైకి ప్రేమగా మాట్లాడుతున్నా.. వారి మనసులో మాత్రం కుట్ర కోణం దాగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హోటల్ గదికి వెళ్లి మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని ఊహించలేకపోయాడు. ఇంతకీ అసలు జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్ అయోధ్య పరిధిలో ఓ వ్యక్తి ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పని నిమిత్తం అధికారి వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. పని పేరుతో రోజూ ఆఫీసుకు వెళ్లి అతడిని కలుస్తూ ఉండేది. ఇలా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజు సీక్రెట్‌గా మాట్లాడాలంటూ హోటల్ గదికి రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్లిన అధికారితో కాసేపు ప్రేమగా మాట్లాడి, తర్వాత దుస్తులు మొత్తం విప్పించింది. అదే సమయంలో మరో వ్యక్తి అధికారికి తెలీకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. మహిళతో గడిపి ఇంటికి వెళ్లిన అధికారికి మరుసటి రోజు ఫోన్ వచ్చింది.

మానసిక ఒత్తిడి కారణంగా భార్యను దగ్గరకు రానీయని భర్త.. అనుమానం వచ్చిన భార్య.. చివరకు విచారించగా..


‘‘అర్జెంట్‌గా రూ.5లక్షలు ఇవ్వకపోతే నీ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’ అంటూ మహిళ హెచ్చరించింది. దీంతో ఖంగుతిన్న అధికారి చివరకు రూ.3లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు. అయితే పదే పదే మహిళ నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కడంపూర్‌కు చెందిన ఖుష్బూ అలియాస్ సీమా అలియాస్ షామాను అరెస్ట్ చేశారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించారు. వీరి ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంతమందిని మోసం చేశారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మొబైల్ షాపు నిర్వాహకుడితో వివాహితకు పరిచయం.. ఉపాధి నిమిత్తం భర్త దూరంగా ఉండడంతో... ఓ రోజు ఏకంగా ఇంటికే పిలిచి..

Updated Date - 2022-05-30T00:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising