ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-07-31T00:22:29+05:30

75వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సమీపిస్తున్న సందర్భంగా నార్తర్న్ కమాండ్ - ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ‘‘హర్ ఘర్ తిరంగ (HarGharTrianga) ’’ పేరుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సమీపిస్తున్న సందర్భంగా నార్తర్న్ కమాండ్ - ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ‘‘హర్ ఘర్ త్రిరంగ’’ (HarGharTrianga) ’’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వరకు ప్రజలు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిస్తోంది. ఇదిలావుండగా, జూలై 30న నార్తర్న్ కమాండ్ - ఇండియన్ ఆర్మీ (NORTHERN COMMAND - INDIAN ARMY) తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. కశ్మీర్‌కు చెందిన పిల్లలు.. చేతిలో జెండాను (National flag) పట్టుకుని, జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపించడం.. అందరినీ ఆకట్టుకుంటోంది.


ప్రజల హృదయాల్లో దేశభక్తి భావనను ప్రేరేపించడంతో పాటూ జాతీయ జెండాపై మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఇటీవల, ఇండియన్ కోస్ట్ గార్డ్.. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొని, నీటి అడుగున జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కశ్మీర్ పిల్లలు ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని, మరో చేత్తో సెల్యూట్ చేస్తూ.. జన గణ మన అంటూ ఆనందంగా పాడటం చూడొచ్చు. "కశ్మీర్ (Kashmir) నుండి అందమైన వీడియో" అని ప్రస్తావిస్తూ భారత సైన్యం.. ఈ వీడియోను షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హర్ ఘర్ త్రిరంగ కార్యక్రమం సందర్భంగా.. ప్రజలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో జెండాను పిన్ చేయవచ్చని ఇండియన్ ఆర్మీ సూచించింది. అలాగే జెండాతో ఉన్న సెల్ఫీలను కూడా అప్‌లోడ్ చేయవచ్చని, తద్వారా వెబ్‌సైట్ నుంచి హర్ ఘర్ త్రిరంగ సర్టిఫికేట్ కూడా పొందవచ్చని పేర్కొంది.

Viral Video: ఈ గొరిల్లా తల్లి ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. అచ్చం మనుషుల్లాగే చేస్తోంది చూడండి..





Updated Date - 2022-07-31T00:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising