ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Funny video: అందుకే దీన్ని గుడ్లగూబ అనేది.. రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను పసిగట్టి.. ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-08-07T03:09:04+05:30

పక్షుల్లో (birds) కొన్ని చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పక్షులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే ఆశ్చర్యంతో పాటూ భయం కూడా కలుగుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పక్షుల్లో (birds) కొన్ని చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పక్షులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే ఆశ్చర్యంతో పాటూ భయం కూడా కలుగుతుంది. అలాంటి పక్షుల్లో గుడ్లగూబ (owl) ఒకటి. పగలంతా పాడుబడ్డ నివాసాల్లో ఉండే ఈ పక్షులు.. రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తాయనే విషయం తెలిసిందే. రాత్రి వేళల్లో వీటిని చూస్తే.. పిల్లలతో పాటూ పెద్దలు భయపడుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ప్రస్తుతం గుడ్లగూబకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (Viral video) అవుతోంది. పక్షులను చిత్రీకరించడానికి రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను (Camera) ఓ గుడ్లగూబ చాలా తెలివిగా పసిగట్టింది. కెమెరా ముందుకు వచ్చి అది ప్రవర్తించిన తీరు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో (Twitter) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అడవిలో పక్షులను చిత్రీకరించేందుకు ఓ కెమెరాను ఏర్పాటు చేసి ఉంటారు. అదే సమయలో మూడు గుడ్లగూబలు అక్కడ ప్రేమగా ముచ్చట్లు పెట్టుకుని ఉంటాయి. వాటిలో ఓ గుడ్లగూబ కళ్లు.. సడన్‌గా కెమెరా వైపు పడతాయి. దీంతో వెంటనే అలర్ట్ అవుతుంది. అరవకండి మనల్ని ఎవరో గమనిస్తున్నారు.. అన్నట్లుగా అక్కడి నుంచి కెమెరా వద్దకు మెల్లాగా వస్తుంది. దగ్గరికి వచ్చి, కెమెరాను తేరిపారా చూస్తుంది. ఇదేంటో అర్థం కాలేదే.. ఏమైతేనేం.. ఒకసారి భయపెడితే పోలా.. అనుకుని, రెక్కలను పూర్తిగా చాపి గుడ్లు ఉరుముతూ భయపెడుతుంది. గుడ్లగూబ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ (Expressions).. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీనిపై ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Anand Mahindra Tweet: చూసేందుకు పిచ్చుక గూడే.. అందులోని టెక్నాలజీ చూస్తే మతి పోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..





Updated Date - 2022-08-07T03:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising