ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సమయానికి ఏనుగు రాకపోతే వీరి పరిస్థితి ఏంటో.. గజరాజు హెల్పింగ్ వీడియో వైరల్..

ABN, First Publish Date - 2022-09-25T01:23:40+05:30

మనుషులకు మనుషులు సాయం చేయడం రొటీన్.. కానీ మనుషులకు జంతువులు సాయం చేయడం.. వెరైటీ. అందులోనూ ఇబ్బందుల్లో ఉన్న వారికి జంతువులు సాయం చేశాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులకు మనుషులు సాయం చేయడం రొటీన్.. కానీ మనుషులకు జంతువులు సాయం చేయడం.. వెరైటీ. అందులోనూ ఇబ్బందుల్లో ఉన్న వారికి జంతువులు సాయం చేశాయని తెలిస్తే.. వావ్! అని అంటాం. ప్రస్తుతం అలాంటి సంఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో చోటు చేసుకుంది. జాతర సందర్భంగా అధిక సంఖ్యలో జనం వాహనాల్లో తరలివచ్చారు. అయితే సడన్‌గా వర్షం పడడంతో అన్ని వాహనాలు బురదలో ఇరుక్కున్నాయి. ఎటూ కదలలేని పరిస్థితిలో ఉండగా, నేనున్నా.. అంటూ ఓ ఏనుగు అక్కడికి వచ్చింది. పదుల సంఖ్యలో తోసినా ముందుకు కదలని వాహనం.. ఏనుగు దెబ్బకు చకాచకా ముందుకు వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


దసరా పండుగ (Dussehra festival) సందర్భంగా మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్‌లో ప్రతి ఏడాదీ జాతర నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. ఈ క్రమంలో సిక్కు సంఘానికి చెందిన చాలా మంది మూడు ట్రక్కుల్లో అమృత్‌సర్‌ నుంచి నాందేడ్‌ పరిధి కొలారస్‌లోని భటోవా గ్రామానికి మూడు ట్రక్కుల్లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సడన్‌గా భారీ వర్షం (heavy rain) కురిసింది. అక్కడంతా మట్టి రోడ్లు కావడంతో మొత్తం బురదమయమైంది. దీంతో వాహనాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జాతరకు వచ్చిన ఓ ఏనుగు.. నేనున్నా అంటూ అక్కడికి వచ్చింది. మావటి సలహా మేరకు.. తొండంతో లారీని చకచకా ముందుకు తోసేసింది. తర్వాత మిగతా వాహనాలను కూడా ఏనుగుల సాయంతో బయటికి తీశారు. దీంతో అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గజరాజు సాయం మరువలేనిదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: యాపిల్‌పై కన్నేసిన కోతి.. చివరకు ఎలా కొట్టేసిందో మీరే చూడండి..





Updated Date - 2022-09-25T01:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising