ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆకాశ వీధిలో యువతి హల్‌చల్... ఇష్టమైన ఫుడ్ తింటూ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి..

ABN, First Publish Date - 2022-09-15T02:54:14+05:30

ఆకాశంలో విహరించాలని అందరికీ ఉంటుంది. అయితే అకాశంలో విహరిస్తూ మధ్యలో ఇష్టమైన ఫుడ్ తింటే ఇంకెలా ఉంటుంది. ఆలాంటి అనుభూతిని మాటల్లో చెప్పలేం కదా. ప్రస్తుతం చాలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకాశంలో విహరించాలని అందరికీ ఉంటుంది. అయితే అకాశంలో విహరిస్తూ మధ్యలో ఇష్టమైన ఫుడ్ తింటే ఇంకెలా ఉంటుంది. ఆలాంటి అనుభూతిని మాటల్లో చెప్పలేం కదా. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి అనుభవాన్ని ఇష్టపడుతున్నారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే చాలా హోటల్ నిర్వాహకులు.. ఆకాశంలో డైనింగ్ టేబుల్ పేరుతో ఏర్పాట్లు కూడా చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఆకాశంలో ఏకాంతంగా విహరిస్తూ.. ఇష్టమైన ఫుడ్ తింటూ ఓ యువతి ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి స్కైడైవింగ్ (Skydiving) చేస్తూ ఆకాశంలోకి వెళ్తుంది. మధ్యలో ఓ పెట్టెను తెరచి చూపిస్తుంది. అందులో తనకు ఇష్టమైన కేక్ ఉంటుంది. ఒక చేత్తో బాక్స్ పట్టుకుని, మరో చేతి నిండా కేక్ తీసుకుని.. నోట్లో పెట్టుకుంటుంది. ఆ సమయంలో యువతి పట్టలేనంత ఆనందంగా ఉంటుంది. హే..! అంటూ చేతులు చూచి, తన ఆనందాన్ని తెలియజేస్తుంది. పక్కనే ఉన్న మరో  స్కైడైవర్ ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వావ్! సూపర్‌గా ఉందంటూ కొందరు, ఇలాంటి అనుభూతిని మాటల్లో చెప్పలేం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి..

husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..





Updated Date - 2022-09-15T02:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising