ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇతడి.. అండర్ వాటర్ మూన్ వాక్ స్టెప్పును చూస్తే.. వావ్! అనాల్సిందే..

ABN, First Publish Date - 2022-09-19T00:58:22+05:30

కాస్త విభిన్నంగా ఉన్న ఏ వీడియో అయినా.. సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతుంటుంది. దీంతో చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్త విభిన్నంగా ఉన్న ఏ వీడియో అయినా.. సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతుంటుంది. దీంతో చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందరిలా కాకుండా భిన్నంగా చేసేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తుంటారు. కొందరు సాహసాలు చేస్తుంటే.. మరికొందరు తాము చేస్తున్న పనినే సరికొత్తగా చేస్తూ అందరి దృష్టిలో పడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral videos) ఓ వ్యక్తి.. నీటి అడుగున మూన్ వాక్ చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓ అందమైన స్మిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుంటాడు. అయితే మామూలుగా ఈదితే వెరైటీ ఏముంటుందీ.. అనుకున్నాడో ఏమో గానీ కొత్తగా ట్రై చేశాడు. మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్పును (Michael Jacksons Moon Walk Step) మక్కీకి మక్కీ దింపేశాడు. నీటి అడుగుకు వెళ్లి.. అచ్చం మైఖేల్ తరహాలో ఒక్కో అడుగును వెనక్కు జరుపుతూ డాన్స్ వేస్తాడు. తర్వాత మళ్లీ తలకిందులుగా మారి అదే స్టెప్పును కంటిన్యూ చేస్తాడు. నీటి అడుగున బ్యాలెన్స్ లేకున్నా.. స్టెప్పును మాత్రం పర్‌ఫెక్ట్‌గా వేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నీటి అడుగున ఇలాంటి డాన్సును ఇండియాలో ఇంతవరకూ ఎవరూ చేయలేదంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో  9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..



Updated Date - 2022-09-19T00:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising