ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏకంగా కొండచిలువనే మింగేసిన పాము.. షాకవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-08-21T22:05:47+05:30

సోషల్ మీడియాలో (Social media) పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో (Social media) పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మామూలుగా అన్నింటినీ కొండచిలువ మింగేస్తుంటుంది. కానీ కొండచిలువను పాము మింగడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇదే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


ఒడిశాలో (Odisha)  ఈ ఘటన చోటు చేసైుకుంది. అటవీ ప్రాంతానికి సమీప గ్రామంలోని ఓ ఇంట్లోకి కొండచిలువ (python) ప్రవేశించింది. అదే సమయంలో ఓ పెద్ద పాము కూడా అక్కడికి వచ్చింది. ఒకదానికొకటి పోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో పాము.. కొండచిలువను అమాంతం మింగేసింది. దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. అంతా చూస్తుండగానే కొండచిలువను మింగేసిన పాము.. కాసేపటి తర్వాత మెల్లి మెల్లిగా బయటికి కక్కేసింది. సమాచారం అందుకున్న స్నేక్ సొసైటీ వారు అక్కడికి చేరుకుని పామును.. సమీపంలోని అడవిలో వదిలేశారు. ఈ సంఘటనను ఆసక్తిగా తిలకించిన స్థానికులు దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: ఎద్దుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. వామ్మో! చివరకు రచ్చ రచ్చ చేసిందిగా..



Updated Date - 2022-08-21T22:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising