ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్నారిని కిడ్నాప్ చేయాలని చూసిన కోతి.. సినిమా సీన్‌ను తలదన్నేలా ఎంట్రీ ఇచ్చింది.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-27T03:14:05+05:30

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని కోతులు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలను గతంలో చూలా చూశాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని కోతులు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలను గతంలో చూలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ తుంటరి కోతి చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు పెద్ద ప్లానే వేసింది. ఏకంగా బైక్‌పై ఎంట్రీ ఇచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లాలని ఐడియా వేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొందరు చిన్న పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఓ కోతి వీరిని గమనిస్తుంది. చిన్నారిని ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేసిందో ఏమో గానీ.. ఓ బొమ్మ బైక్‌పై సినిమా తరహాలో వేగంగా ఎంట్రీ ఇస్తుంది. నేరుగా చిన్నారుల వద్దకు వెళ్లి బైకుపై నుంచి జంప్ చేస్తుంది. అక్కడే ఉన్న ఓ చిన్నారిని పట్టుకుని కొంత దూరం ఈడ్చుకెళ్తుంది. దీంతో చిన్నారి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేస్తుంది. సాధ్యం కాకపోయినా బాలికను ఈడ్చుకెళ్లేందుకు కోతి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి, కోతిని అక్కడి నుంచి తరిమేస్తాడు. దీంతో బాలిక క్షేమంగా బయటపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం 42మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. చిన్నారులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.. అంటూ కొందరు, వామ్మో! ఇదెక్కడి కోతిరా నాయనా... అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులను మక్కీకి మక్కీ దింపేసిన చిన్నారి.. వావ్! అద్భుతం అంటున్న నెటిజన్లు..





Updated Date - 2022-07-27T03:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising