ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: యాపిల్‌పై కన్నేసిన కోతి.. చివరకు ఎలా కొట్టేసిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-09-24T03:14:08+05:30

కోతులు తినుబండాలను చాలా తెలివిగా ఎత్తుకెళ్తుంటాయి. ఎంత కాపాలా ఉన్నా.. ఇలా వచ్చి, అలా పట్టుకెళ్తుంటాయి. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో వీటి బెడద..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోతులు తినుబండాలను చాలా తెలివిగా ఎత్తుకెళ్తుంటాయి. ఎంత కాపాలా ఉన్నా.. ఇలా వచ్చి, అలా పట్టుకెళ్తుంటాయి. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో వీటి బెడద కారణంగా తెగ ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు కోతులు చాలా విచిత్రంగా, తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కోతులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తే, మరికొన్ని కోతులు..  మూడో కంటికి తెలీకుండా తమకు కావాల్సిన వస్తువులు, పండ్లు తదితరాలను కొట్టేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కోపం కంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యాపిల్‌పై కన్నేసిన కోతి.. చివరకు దాన్ని ఎంతో తెలివిగా ఎత్తుకెళ్లడం చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు..


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తన బ్యాగులో కొన్ని యాపిల్ పండ్లను పెట్టుకుని, కోతికి టెస్ట్ పెడతాడు. ఎలా తీసుకెళ్తుందో చూద్దాం అని అనుకుంటాడు. తనకేం తెలీనట్లుగా వెనుకవైపు బ్యాగ్ తగిలించుకుని కూర్చుని ఉంటాడు. అంతలో రెండు కోతులు అతడి వద్దకు వెళ్లాలా, వద్దా అని ఆలోచిస్తూ ఉంటాయి. అయితే వాటిలో ఓ కోతి ధైర్యం చేసి.. మెల్లగా బ్యాగు వద్దకు వస్తుంది. ముందుకు ఓ జిప్ ఓపెన్ చేసి, లోపల ఏమున్నాయో అని చూస్తుంది. ఆ అరలో ఏమీ లేకపోయేసరికి.. మరో జిప్ ఓపెన్ చేస్తుంది. లోపల యాపిల్‌ని చూసి.. ఆహా! పంట పండింది.. అనుకుంటూ మెల్లగా ఓ పండు తీసుకుని అక్కడి నుంచి చెక్కేస్తుంది. ఈ కోతిని చూసి మరో కోతి.. నేను ఓ సారి ట్రైల్ వేస్తా.. అనుకుంటూ బ్యాగు వద్దకు వెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కోతి తెలివికి హ్యాట్సాప్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral photo: చెట్టు మొదలుకు గుడ్లగూబ కళ్లు.. ఎంత బాగా మభ్యపెడుతోందంటూ నెటిజన్ల రియాక్షన్..





Updated Date - 2022-09-24T03:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising