ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ముద్దు ముద్దుగా చెబుతున్న ఈ బుడ్డోడి క్షమాపణకు.. కఠిన హృదయం కూడా కరిగిపోవాల్సిందే..

ABN, First Publish Date - 2022-09-13T22:38:05+05:30

చిన్న పిల్లల బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలు, హావభావాలు.. ఇలా ప్రతి ఒక్కటీ చూడముచ్చటగా ఉంటాయి. ఇకపోతే.. కొందరు పిల్లలు చిన్నతనంలోనే చాలా తెలివిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లల బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలు, హావభావాలు.. ఇలా ప్రతి ఒక్కటీ చూడముచ్చటగా ఉంటాయి. ఇకపోతే.. కొందరు పిల్లలు చిన్నతనంలోనే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. పెద్దవారిలా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. పెద్దవారిని తెలివిగా ప్రశ్నించేవారు కొందరైతే.. తెలివైన జవాబులతో శభాష్ అనిపించుకునేవారు కొందరుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ చిన్నారి తన టీచర్‌కు క్షమాపణలు చెప్పే విధానం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఎక్కడ జరిగిందో  ఏమో తెలీదు గానీ ఓ చిన్నారి వీడియో నెట్టింట తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. పాఠశాల టీచర్ పాఠం చెబుతుండగా.. ఓ బాలుడు తెగ అల్లరి చేస్తుంటాడు. దీంతో టీచర్ అతన్ని పిలిచి.. ‘‘ ఎందుకు పదే పదే అల్లరి చేస్తున్నావ్.. ఎంత చెప్పినా అర్థం కాదా’’.. అంటూ మందలిస్తుంది. దీంతో ఆ చిన్నారి.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయను అంటూ సమాధానం ఇస్తాడు. అయినా టీచర్ మాత్రం అందుకు స్పందించదు. దీంతో రెండు చేతులను కుర్చీ మీద పెట్టి.. దగ్గరగా వెళ్లి ముద్దు ముద్దుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ‘‘ నిజంగా ఇంకోసారి అల్లరి చేయను’’ అంటూ రెండు మూడు సార్లు విన్నవించుకుంటాడు. చివరకు కరిగిపోయిన టీచర్.. నవ్వుతూ ప్రతిస్పందిస్తుంది. తర్వాత తనకు ముద్దు పెట్టాలని చెప్పడంతో.. టీచర్ రెండు చెంపలపై ముద్దు పెట్టి.. మరోసారి క్షమాపణ కోరతాడు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిన్నారి క్షమాపణకు ఎవరైనా కరిగిపోవాల్సిందే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Viral Video: అన్నిసార్లూ ఇలాగే ఉండదు బ్రదర్.. కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో..





Updated Date - 2022-09-13T22:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising