ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బస్సు కింద పడుతుందేమో అని.. పిల్ల ఏనుగును ఎలా రక్షించుకుంటున్నాయో చూడండి..

ABN, First Publish Date - 2022-09-19T03:02:14+05:30

తమ పిల్లలపై మనుషులకు స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో ఉండదో తెలీదు గానీ.. జంతువులకు మాత్రం తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కన్న బిడ్డలపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ పిల్లలపై మనుషులకు స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో ఉండదో తెలీదు గానీ.. జంతువులకు మాత్రం తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కన్న బిడ్డలపై రాక్షసంగా ప్రవర్తించే కొందరు మనుషుల కంటే జంతువులు చాలా మేలని అనిపిస్తుంటుంది. తమ పిల్లలకు చిన్న హాని కూడా కలగకుండా జంతువులు తమ పిల్లలను చూసుకుంటుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే అందుకు నిదర్శనం. ఎదురుగా బస్సు వస్తుండడంతో తమ పిల్లకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో.. ఏనుగులు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంతా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో (Twitter) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. అటవీ ప్రాంతంలో రెండు పెద్ద ఏనుగులు (elephants).. పిల్ల ఏనుగుతో పాటూ రోడ్డు దాటుతూ ఉంటాయి. అదే సమయంలో ఓ బస్సు అటుగా వెళ్తుంది. ఏనుగులను చూసిన బస్సు డ్రైవర్.. నిదానంగా పోనిస్తాడు. అయితే అంతకు ముందే ఏనుగులు అప్రమత్తమవుతాయి. తమ పిల్లకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఏమో అని.. మధ్యలో ఉంచుకుని చెరో వైపు రక్షణగా ఉంటాయి. తీరా బస్సు దగ్గరికి రాగానే మెల్లగా పిల్ల ఏనుగును పక్కకు తీసుకెళ్తాయి. ఈ ఘటనను బస్సులో ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పిల్లల పెంపకం విషయంలో ఈ ఏనుగులను చూసి నేర్చుకోవాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి..

Viral Video: ఇతడి.. అండర్ వాటర్ మూన్ వాక్ స్టెప్పును చూస్తే.. వావ్! అనాల్సిందే.. 





Updated Date - 2022-09-19T03:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising