ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమగా పెంచుకుంటున్న చిలుక ఎగిరిపోవడంతో భోజనం మానేసిన భార్య.. చిలుకను పట్టి తెచ్చిన వారికి భర్త బంపరాఫర్!

ABN, First Publish Date - 2022-02-03T19:27:15+05:30

రాజస్థాన్‌లోని సికార్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని సికార్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతను సికార్‌లోని ప్రముఖ కార్డియాలజిస్ట్. అతని భార్య రెండేళ్లుగా ఓ చిలుకను పెంచుకుంటోంది. మూడ్రోజుల క్రితం అది ఎగిరిపోయింది. దీంతో ఆమె భోజనం, నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంది. దీంతో ఆ చిలుకను పట్టుకోవడానికి డాక్టర్ లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. న్యూస్‌పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. పాంప్లేట్లు పంచారు. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. 


ఆ చిలుకను పట్టి తెచ్చిన వారికి రూ.లక్ష రూపాయల బహుమతి ఇస్తానని డాక్టర్ ప్రకటించారు. సికార్ నగరానికి చెందిన వి.కె.జైన్ భార్య అర్చన మూడ్రోజుల క్రితం తన ఇంటి టెర్రస్ మీద చిలుకకు యాపిల్స్ తినిపిస్తోంది. ఆ సమయంలో ఆ చిలుక ఎగిరిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్చన నిద్రాహారాలు మానేసి ఆ చిలుక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. భార్య బాధ చూడలేక వి.కె.జైన్ ఆ చిలుకను పట్టి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 


బూడిద రంగులో ఉండే ఆ చిలుకను రెండేళ్ల క్రితం రూ.80 వేలకు కొన్నట్టు డాక్టర్ చెప్పారు. ఆ చిలుకకు `కోకో` అని పేరు పెట్టారు. రెండేళ్లలో ఆ చిలుక ఆ ఇంటి సభ్యురాలిగా మారిపోయింది. అరుదైన జాతికి చెందిన ఆ చిలక దాదాపు వెయ్యికి పైగా పదాలు పలికేదట. ఇంటికి వచ్చిన అందరితోనూ మాట్లాడేదట. ఆ ఇంటి సభ్యులే కాదు.. హాస్పిటల్ సిబ్బందికి కూడా ఆ చిలుకతో ప్రత్యేకమైన అనుబంధం ఉందట. ఆ చిలుకను పట్టుకునే పనిలో ప్రస్తుతం వారందరూ బిజీగా ఉన్నారు. 

Updated Date - 2022-02-03T19:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising