ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2022-01-02T00:37:07+05:30

అరుదైన జననం అని చాలా వార్తలు వింటూ ఉంటాం. కానీ ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఇలాంటి జననాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన జననం అని చాలా వార్తలు వింటూ ఉంటాం. కానీ ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఇలాంటి జననాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్లాస్టిక్‌తో చుట్టబడి ఉన్న ఆ శిశువును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్లాస్టిక్ చుట్టబడి జన్మించిన ఆ శిశువును చూసి.. నర్సులు, వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ దూబే మాట్లాడుతూ ఇలాంటి జననాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయని చెప్పారు. ప్రపంచంలో 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు ఇలా జన్మిస్తుంటారని, ఇలాంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీలని పిలుస్తారని వివరించారు. తండ్రి స్పెర్మ్‌లో మార్పుల కారణంగా ఇలా జరుగుతందని తెలిపారు.

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..


ప్రసుత్తం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. భవిష్యత్‌లో ఇలాగే ఉంటుందని స్పష్టంగా చెప్పలేమన్నారు. పంజాబ్‌, తదితర ప్రాంతాల్లో గత ఏడేళ్లలో ఇలాంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి ఇంకా చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిశువు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఔరంగబాద్‌లో ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-01-02T00:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising