Stunning photo: ఒకే ఫొటోలో మంచు, ఇసుక, సముద్రం.. జపాన్ బీచ్‌లో అరుదైన దృశ్యం..
ABN, First Publish Date - 2022-12-07T19:37:12+05:30
జపాన్ బీచ్‌లో ఆవిష్కృతమైన అద్భుతమైన దృశ్యానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు, ఇసుక, సముద్రం ఒకదానినొకటి కలుస్తున్నప్పుడు తీసిన ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
జపాన్ బీచ్‌లో ఆవిష్కృతమైన అద్భుతమైన దృశ్యానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు, ఇసుక, సముద్రం ఒకదానినొకటి కలుస్తున్నప్పుడు తీసిన ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జపాన్‌లోని పశ్చిమ తీరంలో ఫొటోగ్రాఫర్ హిసా ఈ ఫొటోను తీశాడు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ ఫొటో 18,000 లైక్‌లను సంపాదించింది. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. నిజానికి బీచ్‌లలో మంచు కురవడం చాలా అరుదు. మంచు లేదా రాతి బీచ్‌లలో మాత్రమే మంచు కురుస్తుంది. ఇసుక బీచ్‌లలో అలా జరగదు. ఇది చాలా రేర్ ఫొటో అని మరొకరు కామెంట్ చేశారు. నేను ఇప్పటివరకు చూసిన అత్యంత అద్భుతమైన, అందమైన చిత్రాలలో ఇది ఒకటి అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి దృశ్యాలు మన ఊహల్లోనే ఉంటాయని ఒకరు కామెంట్ చేశారు.
Updated Date - 2022-12-07T19:37:14+05:30 IST