ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WhatsApp లో వచ్చిన మెసేజ్‌ చూసి ఆశపడ్డ 57 ఏళ్ల వ్యక్తి.. Yes అని ఇచ్చిన ఒకే ఒక్క రిప్లై‌తో రూ.2 లక్షలు మటాష్..!

ABN, First Publish Date - 2022-06-17T03:03:28+05:30

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక.. ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చేసింది. ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న ఘటనలు సైతం మారుమూల గ్రామాలకు సైతం సెకన్లలో చేరిపోతున్నాయి...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక.. ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చేసింది. ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న ఘటనలు సైతం మారుమూల గ్రామాలకు సైతం సెకన్లలో చేరిపోతున్నాయి. ఈ వెసులుబాటు ద్వారా మంచి ఎంత జరుగుతుందో.. చెడు కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. సైబర్ నేరాలకైతే కొదవే లేదు. కొందరు దుండగులు ఇళ్లలో కూర్చునే లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఎంచుకుంటున్నారు. ముంబైలో ఓ వ్యక్తికి WhatsApp మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఆశపడ్డ అతను.. Yes అని ఒక్క రిప్లై ఇచ్చాడు. అంతే దీంతో ఒక్కసారిగా రూ.2లక్షలు మటాష్ అయ్యాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


ముంబైకి చెందిన బాంద్రా అనే వ్యక్తి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. జూన్ 11న అతడికి ఓ వాట్సప్ సందేశం వచ్చింది. ‘‘ మీకు వీడియో సెక్స్‌పై ఆసక్తి ఉందా”.. అని మెసేజ్ వచ్చింది. ఈ సందేశాన్ని చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై.. వెంటనే Yes అని రిప్లై ఇచ్చాడు. త్వరలో కాల్ వస్తుంది.. దుస్తులు విప్పి సిద్ధంగా ఉండమని అవతలి వ్యక్తి చెప్పాడు. బాత్రూంలోకి వెళ్లి దుస్తులు విప్పగానే.. ఓ మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. అందులో ఆమె మొఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. వీడియో కాల్ ముగిసిన కొద్దిసేపటికి అతడి వాట్సప్‌కు ఓ వీడియో వచ్చింది. అందులో దుస్తులు లేకుండా ఉన్న తనను తాను చూసుకుని ఖంగుతిన్నాడు.

16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..


కాసేపటికి అవతలి వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘వెంటనే రూ.81,000 పంపకపోతే వీడియోను మీ బంధువులు, సోషల్ మీడియాలో షేర్ చేస్తాం’’ అని అనగానే షాక్ అయ్యాడు. వెంటనే వారు అడిగిన మొత్తాన్ని పంపించాడు. తర్వాత మళ్లీ మళ్లీ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇలా మొత్తం రూ.2లక్షల వరకు రాబట్టారు. అయితే తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను పోలీసునని పరిచయం చేసుకుని.. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.1లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

Leave Letter లో ఓ ఉద్యోగి చెప్పిన కారణానికి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంత నిజాయితీ ఏంట్రా బాబూ అంటూ..

Updated Date - 2022-06-17T03:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising