ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Drama In The Sky: ఆకాశంలో విమానం వెళుతుండగా దూసుకొచ్చిన క్షిపణి.. ఆ తర్వాత ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-06-05T17:53:14+05:30

ఇంటర్నెట్‌లో ఒక షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఒక విమానం వెళుతుండగా క్షిపణి ఆ విమానం వైపుగా దూసుకొచ్చింది. ఆ విమానాన్ని దారి మళ్లించడంతో త్రుటిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్‌లో ఒక షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఒక విమానం వెళుతుండగా క్షిపణి ఆ విమానం వైపుగా దూసుకొచ్చింది. ఆ విమానాన్ని దారి మళ్లించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ కొన్ని క్షణాలు విమానంలో ఉన్న ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి. ఏం జరిగిందో ఆ తర్వాత తెలుసుకుని షాకయ్యారు. ఈ ఘటన చైనాలో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. Cathay Pacific Airlinesకు చెందిన Boeing 777 విమానం ప్రయాణికులతో దక్షిణ చైనా సముద్రం మీదుగా వెళుతోంది. అలా వెళుతుండగా ఒక క్షిపణి ఆ విమానం వైపుగా దూసుకొచ్చింది. క్షిపణి విమానం వైపుగా దూసుకెళ్లడాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లకు సందేశం పంపారు. విమానాన్ని వెంటనే 90 డిగ్రీలు ఎడమ వైపుగా తిప్పాలని ATC (Air Traffic Control) ఆదేశాలు పంపింది. ఆ ఆదేశాల ప్రకారం విమానాన్ని దారి మళ్లించడంతో క్షిపణి నుంచి ఆ విమానం తప్పించుకుంది. లేకపోతే క్షిపణి విమానాన్ని ఢీ కొట్టి భారీ నష్టం జరిగి ఉండేది. చైనీస్ మిలటరీ టైప్ 094 న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి JL-3 క్షిపణిని చైనా ప్రయోగించినట్లు తెలిసింది.



సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన ఓ పైలట్ ఈ ఘటనకు సంబంధించిన వీడియో పేరుతో మే 25న తన ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. చైనా ఈ ఘటనను ధృవీకరించలేదు గానీ మే 26న చేసిన ఒక ప్రకటనలో దక్షిణ చైనా సముద్ర ఉపరితలంపై డ్రిల్స్ కండక్ట్ చేసినట్లు మాత్రం పేర్కొంది. ఇదిలా ఉండగా.. Cathay Pacific Airlines ఈ వీడియోపై స్పందిస్తూ తమ ఎయిర్‌లైన్స్ విమానాలేవీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్టుగా రికార్డ్ అవ్వలేదని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. ఆ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై కూడా స్పష్టత లేదు. అంతేకాదు.. ఆ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ వీడియో పాతది అయి ఉంటుందని.. ఇప్పుడు జరిగింది కాకపోవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌‌గా మారింది.

Updated Date - 2022-06-05T17:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising