ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాట్‌ఫాంపై ఉన్న లగేజీ.. వ్యక్తి తీసుకుంటుండగా కదిలిన ట్రైన్.. కాలుజారడంతో చివరకు..

ABN, First Publish Date - 2022-01-10T16:59:46+05:30

రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీని ప్రయాణికుడు తీసుకుంటుండగా ఇంతో ట్రైన్ కదలింది. దీంతో అడికి పట్టుతప్పింది. ఆ త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీని ప్రయాణికుడు తీసుకుంటుండగా ఇంతో ట్రైన్ కదలింది. దీంతో అతడికి పట్టుతప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణశాఖ అధికారి బీఎం దేసాయి (59).. ఓ పని మీద వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆదివారం రోజు ఆయన కారవార రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ టికెట్ తీసుకుని.. గబగబా అప్పటికే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ వద్దకు చేరుకున్నాడు. ముందుగా ట్రైన్‌లోకి ఎక్కిన ఆయన.. ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీ తీసుకునేందకు డోర్ వద్దకు వచ్చాడు. ఇంతలో ట్రైన్ కదలడంతో ఆయన పట్టుతప్పింది. కాలుజారి పట్టాలపై పడబోయాడు. దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసు అధికారి దేసాయిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే డిపార్ట్‌మెంట్ అధికారులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అంతేకాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో ప్రస్తతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  




Updated Date - 2022-01-10T16:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising