ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిల్లర బస్తాతో బైకు షోరూంకు వెళ్లిన వ్యక్తి.. తలలు పట్టుకున్న సిబ్బంది..

ABN, First Publish Date - 2022-02-19T00:42:19+05:30

ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి.. స్కూటీని కొనేందుకు అస్సాంలోని బార్పేట జిల్లా హౌలీలో ఉన్న స్కూటర్ షోరూమ్‌‌ షోరూంకి వెళ్తాడు. మామూలుగా వెళ్లుంటే ఇప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు అందరిలో స్పెషల్‌గా ఉండాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఫేమస్ అవ్వడంలో కొందరు విఫలమైనా.. మరికొందరు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో ఇలాంటి వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బైకు షోరూంకి చిల్లర మూటతో వెళ్తాడు. దీంతో ఒక్కసారిగా షోరూం సిబ్బంది అవాక్కవుతారు.


ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి.. స్కూటీని కొనేందుకు అస్సాంలోని బార్పేట జిల్లా హౌలీలో ఉన్న స్కూటర్ షోరూమ్‌‌ షోరూంకి వెళ్తాడు. మామూలుగా వెళ్లుంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ అతడు చిల్లర నాణేల బస్తా మోసుకుని వెళ్తాడు. లోపలికి వెళ్లగానే ఇతడి బస్తా చూసి.. మొదట ఏదో లగేజీ అనుకుంటారు. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకుని అంతా అవాక్కవుతారు. ‘‘స్కూటీ కొనాలనే కోరిక తీర్చుకోవడానికి.. మమ్మల్ని ఇంత ఇబ్బది పెట్టాలా బాబూ’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ.. చివరికి చేసేదేమీలేక సంచిలోని నాణేలన్నీ చిన్న చిన్న బుట్టల్లో వేసి లెక్కిస్తారు. స్కూటీకి అయ్యే మొత్తం సరిపోయిందని చూసుకున్నాక.. అతడికి వాహనాన్ని అప్పగిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుక్కల కోసం వచ్చిన భారీ కొండచిలువ.. వెనక్కు తగ్గని శునకాలు.. ఏం జరిగిందో మీరే చూడండి..!





Updated Date - 2022-02-19T00:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising