ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Petdog birthday party: భారీ స్థాయిలో శునకం జన్మదిన వేడుకలు.. ఏకంగా 4 వేల మందికి భోజనాలు

ABN, First Publish Date - 2022-06-24T21:46:08+05:30

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. ఊరు ఊరంతటినీ భోజనాలకు పిలిచాడు. 100 కేజీల కేక్ కట్ చేశాడు. ఏకంగా 4 వేల మందికి వెజ్, నాన్-వెజ్ కూరలతో భోజనాలు పెట్టాడు. అతిథులు కేక్ తిని, భోజనాలు చేసి శునకానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఇళ్లకు వెళ్లారు. ఇకపోతే, ఈ సెలబ్రేషన్ వెనుక ఓ పొలిటికల్ స్టోరీ ఉండడం విశేషం. 


కర్ణాటకలోని శివప్పబెళగావి జిల్లాలోని తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్ది ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి `క్రిష్` అని పేరు పెట్టుకున్నాడు. క్రిష్ జన్మదిన వేడుకలను తాజాగా ఘనంగా నిర్వహించాడు. వంద కేజీల కేక్‌ను కట్ చేయించాడు. భారీగా ఖర్చు పెట్టి గ్రామంలోని నాలుగు వేల మందికి వెజ్, నాన్-వెజ్ కూరలతో భోజనాలు పెట్టించాడు. కేక్ కటింగ్ తర్వాత గ్రామంలో ఆ కుక్కను ఊరేగించారు. అయితే క్రిష్ బర్త్ డే పార్టీని శివప్ప ఘనంగా నిర్వహించడం వెనుక చిన్న పొలిటికల్ స్టోరీ ఉందట. 


శివప్ప గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారట. ఇటీవల ఎన్నికైన కొత్త పంచాయతీ సభ్యుడు ఇటీవల ఓ బర్త్ డే పార్టీ ఇచ్చి దానికి పాత పంచాయతీ సభ్యులను కూడా పిలిచాడట. అనంతరం గ్రామస్తులతో.. `మా పార్టీకి పాత పంచాయతీ సభ్యులు కూడా వచ్చి కుక్కల్లా తిన్నార`ని అన్నాడట. ఆ మాటలకు నొచ్చుకున్న శివప్ప తనదైన స్టైల్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. తన పెంపుడు కుక్క బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించి ఊరందరికీ భోజనాలు పెట్టించాడట. 

Updated Date - 2022-06-24T21:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising