ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతడి ఒంటినిండా 800పైగా కీటకాల టాటూలు.. ఎందుకిలా అని అడిగితే అతడి రెస్పాన్స్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-02-03T23:15:02+05:30

ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ పేరుతో యువత ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి 800పైగా కీటకాల టాటూలు వేయించుకున్నాడు. ఎందుకిలా వేయించుకున్నావ్? అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ పేరుతో యువత ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి 800పైగా కీటకాల టాటూలు వేయించుకున్నాడు. ఎందుకిలా వేయించుకున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆసక్తికర సమాధానం చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పూర్వకాలంలో పెద్దలు తమకు ఇష్టమైన వారి పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకునేవారు. ప్రస్తుతం  యువత మాత్రం.. అందంగా కనిపించడం కోసం రకరకాల డిజైన్‌లను ఒంటిపై టాటూలుగా వేయించుకుంటున్నారు. అయితే అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మైఖేల్ అనే వ్యక్తి మాత్రం డిజైన్లకు బదులుగా.. ఒంటిపై ఏకంగా 864 కీటకాల టాటూలను వేయించుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. అంతేకాకుండా.. ‘ఎందుకిలా వేయించుకున్నావ్?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే విచిత్ర సమాధానం చెబుతున్నాడు. తనకు కీటకాలు అంటే అస్సలు నచ్చదని.. చిన్నప్పుడు వాట్ని చూసి తెగ భయపడే వాడిననీ... అందుకే వాటి టాటూలను ఒంటిపై వేయించుకున్నట్టు చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మైఖేల్ చేసిన పనికి అతడికి వరల్డ్ రికార్డు దక్కింది. ఒంటిపై అత్యధిక కీటకాల టాటూలు ఉన్న వ్యక్తిగా మైఖేల్ గిన్నీస్ వరల్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.




Updated Date - 2022-02-03T23:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising