ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: లావుగా ఉన్నాడని బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఏకంగా 70 కిలోలు తగ్గి షాకిచ్చిన ప్రియుడు!

ABN, First Publish Date - 2022-08-24T01:28:41+05:30

బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తికి అతని గాళ్‌ఫ్రెండ్‌ బ్రేకప్ చెప్పేసి వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తికి అతని గాళ్‌ఫ్రెండ్‌ బ్రేకప్ చెప్పేసి వెళ్లింది. అయితే లవ్ ఫెయిల్ అయిందని అతను బాధపడుతూ కూర్చోలేదు. తనను తిరస్కరించిన అమ్మాయికి తగిన సమాధానం చెప్పాలనుకున్నాడు. కష్టపడి వర్కవుట్లు చేశాడు. ఉబకాయుడిగా ఉండే ఆ వ్యక్తి కండల వీరుడిగా మారిపోయాడు. ఏకంగా 70 కిలోల బరువు (Man loses 70 kgs) తగ్గాడు.  తన వెయిట్‌ లాస్‌ జర్నీని అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతని స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral news) మారింది. 


ఊబకాయంతో బాధపడుతున్న పువి అనే యువకుడికి రెండేళ్ల క్రితం అతడి ప్రియురాలు బ్రేకప్ చెప్పేసింది. దీంతో తన శరీరాకృతిని మార్చుకోవాలని పువి నిర్ణయించుకున్నాడు. వెంటనే జిమ్‌లో జాయిన్ అయి వర్కవుట్లు చేయడం ప్రారంభించాడు. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ప్రియురాలు బ్రేకప్‌ చెప్పినప్పుడు పువి బరువు 139 కిలోలు. ఇప్పుడు అతని బరువు కేవలం 74 కేజీలు. 18 నెలల్లో ఎంతో కష్టపడి 70 కిలోలు తగ్గాడు. ట్రిపుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి స్మాల్‌ సైజ్‌కు మారిపోయాడు. 


తన వెయిట్ లాస్ జర్నీని పువి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతను సోషల్ మీడియాలో ఓ స్మాల్ సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంది అతడిని స్పూర్తిగా తీసుకుంటున్నారు. అతడి  కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-08-24T01:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising