Viral video: స్కూల్ బస్‌లో భారీ కొండచిలువ.. అంత పెద్ద కొండచిలువను ఎలా పట్టుకున్నారో చూస్తే..
ABN, First Publish Date - 2022-10-17T20:57:38+05:30
మనుషులను, జంతువులను అమాంతం మింగేసే అత్యంత భారీ కొండ చిలువ (Python) స్కూల్ బస్సులో తల దాచుకున్న
మనుషులను, జంతువులను అమాంతం మింగేసే అత్యంత భారీ కొండ చిలువ (Python) స్కూల్ బస్సులో తల దాచుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో వెలుగులోకి వచ్చింది. 12 అడుగుల పొడవు, 80 కేజీల బరువైన భారీ కొండ చిలువ బస్ లోపలికి వెళుతుండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వెంటనే వచ్చి దానిని బయటకు తీశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయ్‌బరేలిలోని ర్యాన్ పబ్లిక్ స్కూల్‌కి చెందిన బస్సులోకి ఆదివారం భారీ కొండ చిలువ ప్రవేశించింది. ఆదివారం కావడంతో డ్రైవర్ స్కూల్ బస్సును తన ఇంటి దగ్గర పార్క్ చేశాడు. ఆ సమయంలోనే కొండచిలువ బస్‌లోకి ప్రవేశించింది. కొండచిలువను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అరగంట పాటు కష్టపడి కొండ చిలువను బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు.
Updated Date - 2022-10-17T20:57:38+05:30 IST