ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు పుట్టిందని ఎగిరి గంతేసిన తండ్రి.. 9 రోజుల తర్వాత ఇంటికి బయల్దేరాడు.. ఇంతలోనే ఇలా..

ABN, First Publish Date - 2022-01-06T21:31:51+05:30

అతడికి కొన్ని నెలల క్రితమే పెళ్లైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే భార్య గర్భం దాల్చింది. అప్పటి నుంచి తనకు కూతురే పుడుతుందని అందరి ముందూ ధీమా వ్యక్తం చేశాడు. అతడు ఆశిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి కొన్ని నెలల క్రితమే పెళ్లైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే భార్య గర్భం దాల్చింది. అప్పటి నుంచి తనకు కూతురే పుడుతుందని అందరి ముందూ ధీమా వ్యక్తం చేశాడు. అతడు ఆశించిన విధంగానే అతడి భార్య.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం తెలిసి ఎగిరి గంతేశాడు. తండ్రితోపాటు ఆసుపత్రిలో ఉన్న కారణంగా తన కూతురిని చూడలేకపోయాడు. ఆమె పుట్టిన 9 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరాడు. అయితే ఇంతలోనే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని అమర్‌పుర గ్రామానికి చెందిన దేవీలాల్ గద్రీకి కొన్ని నెలల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకు అతడి భార్య గర్భం దాల్చింది. తాజాగా ఆమెకు నెలలు నిండటంతో.. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే దేవీలాల్ తండ్రి  ప్రతాప్‌ గద్రీ.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బంధువు, తల్లిని వెంటపెట్టుకుని జైపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో వారందరూ అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే దేవీలాల్ భార్య కూతురికి జన్మనిచ్చింది. 



తనకు కూతురు పుట్టిందని తెలిసి దేవీలాల్ ఎగిరి గంతేశాడు. దాదాపు 10 రోజుల తర్వాత తండ్రిని డిశ్చార్జ్ చేయడంతో.. దేవీలాల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరారు. కారులో వాళ్లు ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీ కొట్టడంతో ఆ నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. దేవీలాల్ తన కూతురిని కనీసం చూడకుండానే తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో విషాధ చాయలు అలముకున్నాయి. అంత్యక్రియల్లో గ్రామంలోని వేలాది మంది పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-06T21:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising