ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నడీరోడ్డుపై స్నేహితులతో కలసి యువతి రచ్చ.. అర్ధరాత్రి పాన్‌షాప్‌కు వెళ్లి ఆమె చేసిన పనికి అంతా షాక్..

ABN, First Publish Date - 2022-01-08T02:18:29+05:30

మద్యం మత్తులో ఓ యువతి నడీరోడ్డుపై వీరంగం సృష్టించింది. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వేళ పాన్‌షాప్‌కు వెళ్లిన ఆమె అక్కడ రచ్చ చేసింది. దీంతో ఆ రోడ్డున పోయేవాళ్లంతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మద్యం మత్తులో ఓ యువతి నడీరోడ్డుపై వీరంగం సృష్టించింది. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వేళ పాన్‌షాప్‌కు వెళ్లిన ఆమె అక్కడ రచ్చ చేసింది. దీంతో ఆ రోడ్డున పోయేవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆమె చేసిన పని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



డిసెంబర్ 31న యువత హడావిడి మామూలుగా ఉండదు. ఆ రోజంతా ఉత్సాహంగా గడుపుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఓ యువతి డిసెంబర్ 31న ఇద్దరు స్నేహితులతో కలిసి మందు కొట్టింది. ఆ తర్వాత వారితో కలిసి సిగరెట్ కోసమని బయటికొచ్చింది. పక్కనే ఉన్న పాన్‌షాప్‌‌కు వెళ్లి.. సిగరెట్లు ఇవ్వాలని షాప్ కీపర్‌ను కోరింది. అయితే అప్పటికే షాప్ మూసేసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నందున సిగరెట్లు ఇచ్చేందుకు షాప్‌ కీపర్ నిరాకరించాడు. దీంతో యువతి ఆగ్రహానికి లోనైంది. షాప్‌ కీపర్‌పై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడింది. దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. వారిని కూడా ఆమె ఇష్టం వచ్చినట్లు దూషించింది. ఈ క్రమంలో యువతితో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను బైక్‌పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకాస్తా వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. 






Updated Date - 2022-01-08T02:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising