ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

drone saved boy: అలల్లో చిక్కుకున్న బాలుడిని రక్షించిన డ్రోన్.. అదెలాగో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-07-28T00:22:38+05:30

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత (Technology) తో నష్టాలతో పాటూ ఎన్నో ప్రయోజనాలు (Benefits) కూడా ఉన్నాయి. మనుషులు చేయలేని పనులను ప్రస్తుతం యంత్రాలు ఈజీగా చేసేస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత (Technology) తో నష్టాలతో పాటూ ఎన్నో ప్రయోజనాలు (Benefits) కూడా ఉన్నాయి. మనుషులు చేయలేని పనులను ప్రస్తుతం యంత్రాలు ఈజీగా చేసేస్తున్నాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను టెక్నాలజీ సాయంతో సులభంగా కాపాడగలుగుతున్నారు. డ్రోన్ (drone) అనగానే చాలామందికి ఫొటోలు, వీడియోలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అదే డ్రోన్‌.. ఓ బాలుడి ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు సాక్షం. సముద్రపు (sea) అలల్లో చిక్కుకున్న బాలుడిని డ్రోన్ సాయంతో రక్షించగలిగారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (viral) అవుతోంది. దీనిపై నెటిజన్లు (Netizens) వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


స్పెయిన్‌ (Spain) లోని వాలెన్సియా బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీచ్ ఒడ్డున చాలా మంది సందర్శకులు సరదాగా సేదతీరుతుంటారు. ఆ సమయలో ఓ 14ఏళ్ల బాలుడు అలల దాటికి లోపలికి వెళ్లిపోతాడు. ఒడ్డుకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. అయినా అలల దాటికి సముద్రం లోపలికి వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలో అతన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్‌ను పంపిస్తారు. నీటిపై తేలియాడేందుకు వీలుగా ఉండే చొక్కాను డ్రోన్‌కు జత చేసి పంపిస్తారు. సరిగ్గా బాలుడి పైనుంచి చొక్కాను కిందకు వదులుతుంది.

Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..


దీంతో వెంటనే ఆ బాలుడు చొక్కాను ధరించి నీటిపై తేలియాడుతుంటాడు. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది బోటులో అతని వద్దకు వెళ్లి రక్షిస్తారు. బాలుడికి ఆక్సిజన్ అందించిన అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎట్టకేలకు బాలుడు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి 22 బీచ్‌లలో డ్రోన్‌లను ఎగురవేసేందుకు సుమారు 30మందికి పైగా సిబ్బందిని నియమించారు. బాలుడిని రక్షించిన సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: చిన్నారిని కిడ్నాప్ చేయాలని చూసిన కోతి.. సినిమా సీన్‌ను తలదన్నేలా ఎంట్రీ ఇచ్చింది.. చివరకు..





Updated Date - 2022-07-28T00:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising