ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మోడ్రన్ వధువా మజాకా.. పెళ్లిమంటపంలోకి అదిరిపోయే ఎంట్రీ.. రోడ్డుపై అమెను అలా చూసి నోరెళ్లబెట్టిన జనం!

ABN, First Publish Date - 2022-08-18T15:35:20+05:30

వధువును తీసుకురండంటూ పురోహితుడు కేక వేయగానే.. చేతిలో కొబ్బరికాయ పట్టుకుని సిగ్గుతో తల వంచుకుని పెళ్లి కూతురు(Bride) మంటపంలో అడుగు పెట్టేది. పెళ్లిపీటలపై కూర్చుని వివాహం వేడుక(Weddig Celebrations)లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వధువును తీసుకురండంటూ పురోహితుడు కేక వేయగానే.. చేతిలో కొబ్బరికాయ పట్టుకుని సిగ్గుతో తల వంచుకుని పెళ్లి కూతురు(Bride) మంటపంలో అడుగు పెట్టేది. పెళ్లిపీటలపై కూర్చుని వివాహం వేడుక(Weddig Celebrations)లో పాల్గొనేది. ఇదంతా గతం. ఇప్పుడు కాలం మారిపోయింది. అన్ని రంగాల్లో పురుషులకు యువతులు పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వివాహ వేడుకల్లో తమ అభిప్రాయలు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను నిర్మొహమాటంగా చెబుతున్నారు. వారి వారి అభిరుచులకు తగినట్టు.. జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇటువంటి మోడ్రన్ వధువు గురించే. పెళ్లి మంటపం వద్దకు ఓ వధువు వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. 






పెళ్లి సందర్భంగా దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. అనంతరం బుల్లెట్ ఎక్కింది. బండిని జామ్ జామ్ అంటూ నడుపుకొంటూ వివాహ వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చేసింది. అయితే.. నవవధువు బుల్లెట్ బండిని నడపటం(Bride Rides Bullet Bike) చూసి రోడ్డుపై ఉన్న జనం నోరెళ్లబెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌(Viral)గా మారింది. ఈ క్రమంలోనే నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మోడ్రన్ వధువా మజాకా’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-18T15:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising