ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వివాహ వేదికపై వరుడికి షాకిచ్చిన వధువు.. ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టిన బంధుమిత్రులు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-10-05T16:04:50+05:30

అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతున్న సమయంలో.. వేదికపైపే వరుడికి వధువు షాకిచ్చింది. చేతిలో ఉన్న దండను నేలకేసి కొట్టింది. ఆ తర్వాత షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన పనికి అక్కడున్న బంధుమిత్రులు అవాక్కయ్యారు. ప్రస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతున్న సమయంలో.. వేదికపైపే వరుడికి వధువు షాకిచ్చింది. చేతిలో ఉన్న దండను నేలకేసి కొట్టింది. ఆ తర్వాత షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన పనికి అక్కడున్న బంధుమిత్రులు అవాక్కయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


యువతికి పెళ్లీడు వయసు రాగానే ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఓ అబ్బాయిని చూసి ఓకే చెప్పారు. యువతి కూడా అంగీకరించడంతో.. పెళ్లి ఏర్పాట్లు చేశారు. వివాహ పత్రికలు బంధుమిత్రులకు పంచి.. ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే వివాహ వేడకకు బంధుమిత్రులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి(Marriage) వేడుకను వీక్షిస్తుండగా.. ఇంతలో వధువు(Bride) ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వరుడి మెడలో దండ వేయడానికి నిరాకరించిన ఆమె.. దాన్ని నేల కోసి కొట్టింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తన మెడలో ఉన్న దండను కూడా తీసి పడేసింది. వధువు ప్రవర్తన చూసి ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో స్పందించిన వధువు.. ఉన్నత చదువులు చదివిన తాను ఓ నిరక్షరాస్యుడిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోనంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో వరుడు(Bride Groom) సహా అక్కడున్న బంధుమిత్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుండగా.. మరికొందరేమో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పెళ్లి ఇష్టం లేకపోతే.. ముందే చెప్పి ఉండాల్సింది. పెళ్లి పీటల వరకూ వచ్చాక ఇలా చేయడం ఏంటి. పెళ్లి కొడుకు పరువు తీయడం ఎంత వరకు కరెక్ట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-10-05T16:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising