ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra Tweet: చూసేందుకు పిచ్చుక గూడే.. అందులోని టెక్నాలజీ చూస్తే మతి పోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2022-08-07T02:37:42+05:30

ప్రకృతిలో (nature) ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఒక్కోటి బయటపడుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకృతిలో (nature) ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఒక్కోటి బయటపడుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఇంజినీరింగ్ వ్యవస్థ (Engineering system) కూడా చాలా అభివృద్ధి చెందింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా వినూత్న రీతిలో నిర్మాణాలు చేపడుతున్నారు. మనుషుల విషయంలో ఇది ఓకే గానీ.. జంతువులు, పక్షుల విషయంలో కూడా ఇది వర్తిస్తుందా.. అంటే, అవును అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న పిచ్చుక గూడే ఇందుకు నిదర్శనం. శత్రువుల బారి నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు పక్షి కట్టిన గూడు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను (Anand Mahindra) ఈ గూడు ఎంతో ఆకట్టుకుంది. వెంటనే ఆ ఫొటోను తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు.


పిచ్చుక గూడును చూస్తే పైకి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ దాని లోపలి భాగం చూస్తే.. ఆశ్చర్య కలగుతుంది. శత్రువుల బారి నుంచి తమ పిల్లలను రక్షించుకునేలా పక్షులు తమ గూళ్లను తయారు చేసుకుంటాయి. పక్షి పిల్లలపై తరచూ పాములు దాడి చేస్తుంటాయనే విషయం తెలిసందే. అయితే పాము గూడులోకి వెళ్లినా పిల్లలు కనిపించకుండా అందులో ఏర్పాట్లు ఉంటాయి. గూడులోనే రెండు అరలు ఉండడంతో.. ఒక వేళ పాము లోపలికి వెళ్లినా ఖాళీ అర మాత్రమే దర్శనమిస్తుంది. అయితే తల్లి పక్షిమాత్రమే లోపలికి వెళ్లేలా అందులోనే ఇంకో అర ఉంటుంది. ఆ అరలో పిల్లలను ఉంచి.. పక్షులు ఆహార వేటకు బయటికి వెళ్తుంటాయి. ఈ పక్షి తెలివికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర.. పక్షి గూడు నిర్మాణాన్ని వివరిస్తూ.. కార్పొరేట్ రిస్క్ మరియు కార్పొరేట్ స్ట్రాటజీ డిపార్ట్‌మెంట్‌ల కోసం దాన్ని నియమించుకోవాలని అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

girlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం..





Updated Date - 2022-08-07T02:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising