ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అంతా చూస్తుండగా వేగంగా దూసుకొచ్చి నీళ్లల్లో పడ్డ ట్రక్కు.. డ్రైవర్‌కు ఈత రాకపోవడంతో.. చివరకు

ABN, First Publish Date - 2022-03-04T02:51:44+05:30

బోస్టన్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్‌పీఎస్‌) మెయిల్స్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని ప్రమాదాలు.. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సమయంలో కొన్నిసార్లు అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినా.. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు’’.. అని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు అంతా ఆశ్చర్యపోతుంటారు. అటువంటిదే ఆశ్చర్యకర సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా.. ఓ పెద్ద ట్రక్కు రోడ్డుపై వేగంగా వస్తూ ఒక్కసారిగా అదుపుతప్పి దూసుకొచ్చి నీళ్లలో పడింది. డ్రైవర్‌కు ఈత రాకపోవడంతో చివరకు ఏం జరిగిందంటే..


ట్విటర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పట్టపగలు బోస్టన్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్‌పీఎస్‌) మెయిల్స్‌ను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు వేగంగా వస్తోంది. ఈ క్రమంలో అంతా చూస్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి 50 అడుగుల వంతెన పైనుంచి బోస‍్టన్‌ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడిపోయింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. లోపల ఉన్న వారికి ఏమైందో ఏమో అని అంతా ఆందోళన చెందుతున్నారు.

‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని అడిగిన ప్రియుడు.. చివరకు ఆమె చెప్పిన సమాధానం విని..


అయితే అదృష్టవశాత్తు డ్రైవర్.. ట్రక్కు నుంచి బయటికి వచ్చాడు. చివరకు అతడికి ఈత రాకపోవడంతో కాసేపు తడపడ్డాడు. తర్వాత సగం మునిగిపోయి ఉన్న ట్రక్కు పైకి ఎక్కాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌ను రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మగలరా..? 6నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గి.. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత..





Updated Date - 2022-03-04T02:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising